JAISW News Telugu

Private bus : ట్రాక్టర్ ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. నలుగురి మృతి

FacebookXLinkedinWhatsapp

Private bus : ముంబై ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేసర్ నుంచి పండరీపూర్ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 42 మందికి గాయాలయ్యాయి. ప్రమాద స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను దగ్గరలోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

ఆషాఢం ఏకాదశి సందర్భంగా 54 మందితో ప్రైవేటు బస్సు డోంబివిలీలోని కేసర్ గ్రామం నుంచి పండరీపూర్ కు వెళ్తుండగా సోమవారం (జూలై 15) అర్ధరాత్రి ముంబై-పూనె హైవే దగ్గర ట్రాక్టర్ ను డీకొట్టిందని పోలీసులు తెలిపారు. కాలువలో పడిన బస్సును క్రేన్ సాయంతో వెలికితీశారు. ఈ ప్రమాదంతో ముంబై ఎక్స్ ప్రెస్ హైవేలోని ముంబై-లోనావాలా లేన్ లో 3 గంటల తర్వాత వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version