YouTube : యూట్యూబ్ వినియోగదారులపై ధరల బాంబు

YouTube

YouTube

YouTube : భారతదేశంలోని కోట్లాది మంది యూట్యూబ్ వినియోగదారులకు గూగుల్ పెద్ద దెబ్బ వేసింది. కంపెనీ తన వీడియో ప్లాట్‌ఫారమ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను పెంచేసింది . యూట్యూబ్ ప్రీమియం కోసం వినియోగదారులు గతం కంటే మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. గూగుల్ అన్ని నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్లాన్‌ల రేట్లను పెంచిసేంది.  యూట్యూబ్‌లో యాడ్-రహిత వీడియోలను చూడటానికి వినియోగదారులు ఇక నుంచి మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది.

యూట్యూబ్ ప్రీమియం వెబ్‌సైట్‌లో గూగుల్ ఇండియా కొత్తగా సవరించిన ప్లాన్ రేట్లను అప్‌లోడ్ చేసింది. యూట్యూబ్ అన్ని పర్సనల్, స్టూడెంట్, ఫ్యామిలీ ప్యాక్ ల ప్లాన్ ధరలు పెరిగాయి.

యూట్యూబ్ కొత్త ప్రీమియం రేట్లు

యూట్యూబ్ ప్రీమియం నెలకు రూ.79 స్టూడెంట్ ప్లాన్ కోసం, వినియోగదారులు ఇప్పుడు ప్రతి నెలా రూ.89 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ రేటు రూ.10 పెరిగింది. అదే సమయంలో, వ్యక్తిగత నెలవారీ ప్లాన్ కోసం, యూజర్లు ఇప్పుడు అదనంగా రూ. 20 చెల్లించాల్సి ఉంటుంది. నెలకు రూ.129 వ్యక్తిగత ప్లాన్ కోసం, వినియోగదారులు ఇప్పుడు రూ.149 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

యూట్యూబ్ ప్రీమియం ఫ్యామిలీ ప్యాక్ ప్లాన్ కోసం యూజర్లు ఇప్పుడు ప్రతి నెలా రూ. 110 అదనంగా చేయాల్సి ఉంటుంది. నెలకు రూ.189 ఉన్న ఈ ప్లాన్ ఇప్పుడు రూ.299లకు పెరిగింది. అదే సమయంలో, వ్యక్తిగత ప్రీపెయిడ్ నెలవారీ ప్లాన్‌ల కోసం, వినియోగదారులు ఇప్పుడు ప్రతి నెలా రూ. 20 ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. రూ.139 నెలవారీ ప్లాన్ కోసం, వినియోగదారులు ఇప్పుడు ప్రతి నెలా రూ.159 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

వ్యక్తిగత క్వార్టర్లీ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం యూజర్లు ఇప్పుడు రూ.60 ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. రూ.399 ప్లాన్ ధర ఇప్పుడు రూ.459గా మారింది. అదే సమయంలో, వ్యక్తిగత వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ కోసం రూ. 200  అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రూ.1290 ప్లాన్ కోసం, వినియోగదారులు ఇప్పుడు రూ.1490 వెచ్చించాల్సి ఉంటుంది.

TAGS