JAISW News Telugu

T20 World Cup 2024 : సంచలనాలకు వేదిక.. టీ 20 వరల్డ్ కప్ .. పెద్ద జట్లపై సంచలన విజయాలు నమోదు 

T20 World Cup 2024

T20 World Cup 2024

T20 World Cup 2024 : టీ 20 వరల్డ్ కప్ సూపర్ డూపర్ హిట్ అవుతోంది. లో స్కోరింగ్ నమోదవుతున్న పిచ్ లపై చిన్న జట్లు విజయాలు సాధిస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాయి.  ఇప్పటికే ఈ సీజన్ లో కెనడా, ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో తనకంటే బలమైన ప్రత్యర్థి అయిన ఐర్లాండ్ ను కెనడా మట్టి కరిపించింది. కేవలం 138 పరుగులు చేసిన కెనడా.. ఐర్లాండ్ ను 125 పరుగులకే కట్టడి చేసి సంచలన విజయం నమోదు చేసింది. 

యూఎస్ఏ, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో యూఎస్ఏ పాకిస్థాన్ ను ఓడించి సంచలన విజయం నమోదు చేసింది. యూఎస్ఏ కెప్టెన్ మొనాంక్ పటేల్ వీరోచిత ఇన్సింగ్స్ తో 50 పరుగులు చేయగా.. అరోన్ జోన్స్, అండ్రీస్ ఇద్దరు బ్యాటర్లు వీరోచితంగా ఆడి 160 పరుగులను సమం చేశారు. అనంతరం జరిగిన సూపర్ ఓవర్ లో అద్భుతంగా పోరాడి అయిదు పరుగుల తేడాతో విజయం సాధించి యూఎస్ఏ పాయింట్స్ టేబుల్స్ లో గ్రూపు ఏ లో మొదటి స్థానానికి చేరుకుంది. 

శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ లో బంగ్లా టీం లంకేయులను ఓడించి పాయింట్స్ టేబుల్స్ లో పైకి చేరారు. బంగ్లా కంటే మెరుగైన జట్టుగా ఉన్న లంక కేవలం 124 పరుగులే చేయగా.. బంగ్లా ఎనిమిది వికెట్లు కోల్పోయి విక్టరీ నమోదు చేసింది. దీంతో లంక టీం దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. ఇప్పటికే సౌతాఫ్రికాతో ఓడిపోయిన లంక, బంగ్లాతో ఓటమితో టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమణ అయినట్లే. 

ఈ రోజు జరిగిన న్యూజిలాండ్, అఫ్గాన్ మ్యాచ్ లో న్యూజిలాండ్ కు షాక్ ఇచ్చారు అఫ్గాన్ ప్లేయర్లు. కేవలం 159 పరుగులు చేసిన అఫ్గాన్ కివీస్ ను కేవలం 75 పరుగులకే ఆలౌట్ చేసి షాకిచ్చింది. అఫ్గాన్ బౌలర్లు, ఫజుల్ ఫారూకీ 4, రషీద్ ఖాన్, 4 వికెట్లు తీసి కివీస్ ను మట్టికరిపించారు. ఇలా గ్రూపు మ్యాచ్ లు కాకముందే పెద్ద జట్లపై చిన్న జట్లు సంచలన విజయాలు నమోదు చేస్తున్నాయి.

Exit mobile version