Gaya Hills : గయ కొండల్లో మధుమేహాన్ని నివారించే మొక్క

Gaya Hills

Gaya Hills

Gaya hills : బీహార్‌లోని గయలోని బ్రహ్మయోని కొండల్లో పరిశోధకుల బృందం ఔషధ మొక్కలను కనుగొంది. మధుమేహం వంటి వ్యాధుల చికిత్సలో ఇవి ప్రభావవంతంగా ఉంటాయి. ఈ మూలికా మొక్కలను అంతరించిపోకుండా కాపాడేందుకు, వాటిని సంరక్షించి, పెంపొందించేలా స్థానిక ప్రజలను ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పరిశోధన ఫలితాలు ఇటీవలే ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్రియేటివ్ రీసెర్చ్ థాట్స్‌లో ప్రచురించబడ్డాయి.

శాస్త్రవేత్తలు కనుగొన్న మొక్కలలో గుర్మార్‌ అనే మొక్క కూడా ఉంది. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో దోహదపడుతుంది. ఎథ్నోగ్రాఫిక్ రీసెర్చ్ పేరుతో ప్రచురించబడిన అధ్యయనం గుర్మార్‌లో జిమ్నెమిక్ యాసిడ్ ఉనికికి రక్తంలో చక్కెరను తగ్గించే ప్రత్యేక సామర్థ్యం ఉందని పేర్కొంది. ఇది ప్రేగు బయటి పొరలో గ్రాహక సైట్‌లను ఆక్రమించడం ద్వారా పనిచేస్తుంది. దీంతో స్వీట్లు తినాలనే కోరిక తగ్గుతుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇప్పటికే డయాబెటీస్ డ్రగ్ BGR-34ను అభివృద్ధి చేయడానికి గుర్మార్ ను ఉపయోగించింది. దీనిని ఎమిల్ ఫార్మా యాంటీ-డయాబెటిక్ ఆయుర్వేద సూత్రీకరణగా విక్రయిస్తోంది. గుడ్‌మార్‌తో పాటు, BGR-34లో డయాబెటిక్ నిరోధక మందులు దారుహరిద్ర, గిలోయ్, విజయ్‌సర్, మంజిష్ఠ కూడా ఉన్నాయి.

బ్రహ్మయోని కొండపై కనిపించే మూడు ఔషధ మొక్కలలో గుర్మార్ ఒకటి. ఇది సహజ నివారణల నిధి. ఇది ఔషధ మూలికగా శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో దీనిని ఉపయోగించారు. ఇది కాకుండా  పిథెసెల్లోబియం డ్యూల్స్, జిజిఫస్ జుజుబా అనే మరో రెండు మొక్కలు ఉన్నాయి. వాటిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ పరిశోధన ఉద్దేశ్యం ప్రజలు ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించే సాంప్రదాయ నివారణల నైపుణ్యాన్ని సంరక్షించడం.  ఈ పర్వతంపై కనిపించిన వనమూలికలు అంతరించిపోకుండా.. స్థానికుల సాయంతో వాటిని సాగు చేయించాలని శాస్త్రవేత్తలు యోచిస్తున్నారు. చికిత్సల కోసం ఆ ప్రాంతవాసులు ఉపయోగించే మొక్కలను గుర్తించి, వాటికి సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేయాలని భావిస్తున్నారు.

TAGS