Airbus A380 : విమాన ప్రయాణం అంటే చాలా మందికి ఓ జీవిత కాలపు కల. కొందరు సంపన్నులు విదేశాలకు విమానాల్లో అప్ అండ్ డౌన్ చేస్తుంటే..మెజార్టీ జనాలు మాత్రం నేలపై ఉండి పైన ఎగిరే విమానాన్ని చూసి ఆనందపడుతుంటారు. విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు లగ్జరీ..కానీ ఇప్పుడిప్పుడే సామాన్యులకు ఈ కల చేరువవుతోంది. ఇక సంపన్నుల కోసం విమాన ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, విలాసవంతంగా చేస్తున్నారు. ఆ భారీ విమానాలను చూస్తే విమానమా.. రాజభవనమా అనిపిస్తుంది.
అయితే విమానాల్లో ఎయిర్ బస్ ఏ 380 వైభవం వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. అత్యంత విలాసవంతమైన, విశాలమైన విమానం ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం. ఎయిర్ బస్ ఏ 380 పొడవు 72.7 మీటర్లు, 501-575 టన్నుల బరువు. విమానం లోపలకు వెళ్లి చేస్తూ ఔరా అనిపిస్తుంది. వందలాది సీటింగ్ తో వామ్మో అనిపిస్తుంది. ప్యాసింజర్ రేంజ్ ను బట్టి క్లాస్ ఉంటుంది. ఇక కొన్ని క్లాసులో కంప్యూటర్ తో కూడిన సీటింగ్ ఉంది. ఇక ఇందులోనే ఓ బార్ షాపు కూడా ఉందండోయ్. మద్యం ఫ్రీగానే ఇస్తారులెండి. నిజంగా ఈ విమానాన్ని చూస్తే ఏదో ఓ పెద్ద ప్రపంచాన్ని చూసినట్టే ఉంది. ఇందులో ఒకేసారి 525-853 మంది దాక ప్రయాణించవచ్చు. అంటే ఓ చిన్నపాటి ఊరే అని చెప్పవచ్చు. ఇక విమానంలో అడగడుగునా అందమైన సిబ్బంది ఆప్యాయంగా పలకరిస్తుంటారు.
ఇది డబుల్ డెక్కర్ విమానం. ఇందులో క్యాసినో లాంటి విలాసవంతమైన రెస్టారెంట్ తో పాటు ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి. ఇది 9000మైళ్ల దూరం ఏకంగా ప్రయాణించగలదు. అయితే సూపర్ జంబో విమానాల తయారీ అంత లాభదాయకంగా లేకపోవడంతో విమానాల తయారీని ఆపివేయనున్నట్లు గతంలోనే ఎయిర్ బస్ ప్రకటించింది.