Sunstroke : ఓటు వేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి పోలింగ్ బూత్ క్యూలో నిల్చొని వడదెబ్బతో కుప్పకూలిపోయాడు. శనివారం (ఈరోజు) యూపీలో ఏడో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా ఓటు వేసేందుకు బూత్ వద్ద క్యూలో నిలబడి ఓ వ్యక్తి వడదెబ్బతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
రిపోర్ట్స్ ప్రకారం.. యూపీలోని పక్రి ప్రాంతంలో చక్ బహుద్దీన్ గ్రామంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఈ సంఘటన జరిగింది. మృతుడు 65 ఏళ్ల రామ్ బచన్ చౌహాన్ గా గుర్తించారు. రాష్ట్రంలోని 13 లోక్ సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతాన్ని విపరీతమైన వేడిగాలులు వీయడంతో రామ్ బచన్ చనిపోయారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్ లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేశారు.