Chandrababu : ఏప్రిల్ నుంచే రూ.4వేల పింఛన్ ఇస్తా..ఇదీ చంద్రబాబు భరోసా

Chandrababu

Chandrababu

Chandrababu : ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పార్టీలన్నీ ప్రచార బాట పట్టాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో అందరి కంటే ముందున్నారు. 70ఏండ్ల పైబడి వయస్సులోనూ మండుటెండలో ఆయన ఫుల్ యాక్టివ్ గా ప్రచారంలో దూసుకెళ్తుంటే ప్రత్యర్థి పార్టీ వణికిపోతోంది. ఇక ప్రతీ రోజు రెండు, మూడు చోట్ల ప్రజాగళం సభలు నిర్వహిస్తూ కూటమి ఘన విజయానికి బాటలు పరుస్తున్నారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఆయన జనాల్లో తీసుకెళ్తున్నారు. దీంతో సర్వత్రా టీడీపీ పథకాలపై చర్చ జరుగుతోంది.

శుక్రవారం ఆయన తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో మీడియా సమావేశంలోనూ, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగళం సభల్లో మాట్లాడారు..ఏప్రిల్ నుంచే రూ.4వేల చొప్పున పింఛన్ ఇస్తామని, ఏప్రిల్, మే జూన్ నెలల్లో లబ్ధిదారులు తీసుకునే రూ.3 వేలకు అదనంగా మరో వెయ్యి చొప్పున జూలై నుంచి ఇచ్చే పింఛన్ లో కలిపి ఇస్తామని హామీ ఇచ్చారు. పెన్షన్ల పేటెంట్ హక్కు టీడీపీదేనని, గెలవగానే పింఛన్లు పెంచుతామన్నారు. అలాగే మొదటి తేదీనే ఇంటి దగ్గర కొచ్చి మరి పింఛన్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఒకవేళ ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే మూడు నెలల వరకూ ఒకే సారి తీసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు.

మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని, సైకో తాత్కాలికంగా ఆనందించినా, అంతిమంగా ధర్మమే గెలస్తుందని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో జగన్ రూ.13లక్షల కోట్లు అప్పులు తెచ్చాడని, ఖజానా ఖాళీ అయ్యిందన్నారు. ఫ్యాన్ అరిగిపోయిందని, దాన్ని ముక్కలు ముక్కలు చేయాలన్నారు. జగన్ ఎక్స్ పైర్డ్ మెడిసిన్ అని మండిపడ్డారు. ‘‘ నా 40ఏండ్ల అనుభవంలో ఎవరూ నాతో పెట్టుకోలేదు. వచ్చాడు.. బచ్చా.. వదలను.. నా తడఖా చూపిస్తా.. జాబ్ రావాలంటే రాష్ట్రంలో ఎన్డీఏ రావాలి. నిరుపేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లను నిర్మిస్తాం. వైసీపీ ఇచ్చింది సెంటు స్థలం. దానికి కూడా లంచాలు మేశారు. కొత్తగా భూచట్టం తీసుకొచ్చారు. ఇప్పటివరకు జగన్ ప్రభుత్వ స్థలాలు అమ్ముకున్నాడు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఇళ్లు, ఆస్తులు కూడా తనఖా పెట్టి అప్పులు తెచ్చుకుంటాడు.’’ అని చెప్పుకొచ్చారు.

పెన్షనర్ల పట్ల జగన్ నీచంగా, దుర్మర్గంగా ప్రవర్తించాడని, ఆయన్ను ఈసీ ప్రశ్నించాలన్నారు. జగన్ చేతకానితనం, దురుద్దేశ చర్యలతో కొంతమంది పెన్షనర్లు చనిపోయారని, అవి ప్రభుత్వ హత్యలేనన్నారు. ఈ హత్యలు చేసిన సీఎంకు ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు లేదని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

TAGS