SRH Vs PBKS : సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరింది. కానీ పంజాబ్ తో చివరి లీగ్ మ్యాచ్ లో గెలిచి రెండో స్థానం చేరడానికి ఉవ్విళ్లూరుతోంది. సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో గెలిస్తే 16 పాయింట్లతో పాటు రన్ రేట్ మెరుగుపడుతుంది. కోల్ కతా తో రాజస్థాన్ ఓడిపోతే సన్ రైజర్స్ డైరెక్టు గా రెండో స్థానంలోకి వెళుతుంది. దీంతో క్వాలిఫైయర్ 1 లో మ్యాచ్ ఆడే అవకాశం వస్తుంది. దీంతో క్వాలిఫైయర్ 1 ఓడిపోయినా.. మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది.
సన్ రైజర్స్ బ్యాటర్లు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు భీకర ఫామ్ లో ఉండగా.. ప్రత్యర్థి బౌలర్లపై పవర్ ప్లే లోనే విరుచుకుపడుతున్నారు. ఓవర్ కు 15 నుంచి 20 పరుగులు చేస్తూ 100 కు పైగా రన్స్ చేస్తున్నారు. మిడిలార్డర్ లో క్లాసెన్, మార్కమ్, నితిశ్ కుమార్ రెడ్డి, సమద్, షెహజాద్ లు కూడా రాణిస్తూ భారీ స్కోరు చేయడానికి తోడ్పాటునందిస్తున్నారు.
భువనేశ్వర్ కుమార్, నటరాజన్ తో పాటు కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ లో రన్స్ ఎక్కువగా ఇవ్వడం లేదు. స్పిన్నర్ కొరత కనిపిస్తున్నా.. దాన్ని తెలియనీయకుండా పేస్ బౌలర్లే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. సన్ రైజర్స్ ప్రస్తుతం క్లాసెన్ తిరిగి పామ్ లోకి రావాలని కోరుకుంటోంది.
పంజాబ్ ఇప్పటి వరకు అయిదు మ్యాచులే గెలిచి టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. కేవలం పరువు నిలుపుకోవడానికే ఈ మ్యాచ్ ఆడనున్న పంజాబ్ ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి. అయితే గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి సన్ రైజర్స్ కు హెచ్చరికలు పంపింది. టాప్ 2 స్థానంలో ఉన్న రాజస్థాన్ ను ఓడించడంతో పాటు సన్ రైజర్స్ పై విజయం సాధించి 12 పాయింట్లతో టోర్నీ నుంచి వైదొలగాలని చూస్తోంది. సామ్ కర్రన్ కూడా గత మ్యాచ్ లో రాణించి మంచి ఊపు మీద ఉన్నారు. రాహుల్ చాహర్, హర్ ప్రీత్ బ్రార్ కూడా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. ఉప్పల్ లో వర్షం పడే అవకాశం ఉంది.