LSG Vs MI : లక్నో సూపర్ గెయింట్స్.. ముంబయి ఇండియన్స్ మధ్య నామమాత్రపు పోరు
LSG Vs MI : లక్నో, ముంబయి ఇండియన్స్ మధ్య రెండు జట్ల చివరి లీగ్ మ్యాచ్ వాంఖడే లో శుక్రవారం జరగనుంది. లక్నో టీం 12 పాయింట్లతో ఇంకా ప్లే ఆఫ్స్ పై ఆశలు పెట్టుకున్నా.. అవి దాదాపు 0.1 శాతం మాత్రమే. ఎందుకంటే చెన్నై, ఆర్సీబీ మధ్యలోనే కీలక పోరు జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య ఎవరూ ఎక్కువ రన్ రేట్ తో గెలిస్తే వారే ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఉంది. లక్నో రన్ రేట్ చాలా తక్కువగా ఉండడం వల్ల ప్లే ఆఫ్స్ వెళ్లే అవకాశాలు దెబ్బతిన్నాయి.
ఈ సీజన్ లో ముంబయి ఇండియన్స్ పాయింట్ల టేబుల్ లో చివరి స్థానంలో ఉంది. 13 మ్యాచుల్లో కేవలం నాలుగు మ్యాచులే గెలిచింది. ముంబయి ఈ సీజన్ లో ఆట కంటే వివాదాలనే ఎక్కువ కొని తెచ్చకున్నట్లయింది. రోహిత్ శర్మను కాదని హర్దిక్ పాండ్యాను ముంబయికి కెప్టెన్ గా నియమించిన యాజమాన్యం లేని తలనొప్పిని కొని తెచ్చుకుంది. ముంబయి టీంను ఏకతాటిపై నడిపించడంలో హర్దిక్ విఫలమయ్యాడు.
హర్దిక్ పాండ్యా అటిట్యూడ్ కారణంగానే ముంబయి టీం బాగా ఆడలేకపోయిందని ఫ్యాన్స్ విమర్శలు చేస్తుంటే.. ముంబయి టీం రెండుగా విడిపోయిందని విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మ లాంటి సీనియర్లకు హర్దిక్ పాండ్యా రెస్పెక్ట్ ఇవ్వడం లేదని సమాచారం. నెక్ట్స్ సీజన్ లో రోహిత్ ముంబయికి ఆడకపోవచ్చని కూడా తెలుస్తోంది.
లక్నో కూడా మొదట్లో మంచి విజయాలు సాధించిన తర్వాత ఓటములతో గాడి తప్పింది. దీనికి తోడు లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా.. కే ఎల్ రాహుల్ ను మీడియా ముందే తిట్టడం లాంటి సంఘటనలతో లక్నో టీం కూడా దారుణంగా ట్రోల్స్ కు గురైంది. ఇలాంటి సమయంలో ఈ సీజన్ లో చివరి మ్యాచ్ గెలిచి గౌరవప్రదంగా ఇంటి బాట పట్టాలని కోరుకుంటున్నాయి.