Indian arsenal : భారత అమ్ములపొదిలోకి సరికొత్త అస్త్రం

Indian arsenal : భారతదేశం రక్షణ రంగంలోకి ఒక కొత్త ఆయుధం చేరింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన అధిక శక్తి కలిగిన లేజర్ ఆయుధాన్ని తొలిసారిగా విజయవంతంగా పరీక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో జరిగిన పరీక్షల్లో, ఈ ఆయుధం గాల్లో ఎగురుతున్న యూఏవీలు మరియు డ్రోన్‌లను నేలకూల్చడంలో విజయం సాధించింది. దీనికి సంబంధించిన వీడియోను డీఆర్‌డీవో ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసింది.

TAGS