Hyderabad : డబ్బు తరలింపునకు నయా స్కెచ్.. అయినా దొరికిపోయారు
Hyderabad : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. సభులు, సమావేశాలు నిర్వహించి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం రకరకాల మార్గాలను వెతుకుతున్నారు. డబ్బు తరలించేందుకు బ్యాంకులు, ఏటీఎంలకు తరలించే ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
తాజాగా సైబరాబాద్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో బ్యాంకులకు నగదు తరలించే వాహనంలో భారీగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. రూ.1.06 కోట్ల నగదును సీజ్ చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోతు చేశారు. ఆ డబ్బు ఎవరిది..? ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాలపై విచారణ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర బలగాలు, పోలీసులు, ఎన్నికల అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.100 కోట్ల వరకు సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.