Prithviraj Sukumaran : పృథ్వీ రాజ్ కొన్న కొత్త కారు.. స్పీడ్ తెలిస్తే మతి పోవాల్సిందే..

Prithviraj Sukumaran
Prithviraj Sukumaran : సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు పృథ్వీరాజ్. సలార్ మూవీలో కీలక పాత్రలో నటించాడు. సలార్ అనంతరం ఆయన నటించిన ది గోట్ లైఫ్ అనే మూవీ బ్లాక్ బ్లస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీని ఆడు జీవితం అని తెలుగులో రీమేక్ చేశారు. దీనికి కూడా భారీ రెస్పాన్సె వచ్చింది.
పృథ్వీరాజ్ తాజాగా మరో ఖరీదైన కారును కొనుక్కున్నాడు. మలయాళ ఇండస్ట్రీలో టాప్ హిరోల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకడిగా కొనసాగుతున్నాడు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో పృథ్వీకి మంచి ఫాలోయింగ్ ఉండగా.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక మైన స్థానం సంపాదించుకున్నాడు.
సలార్ లో అందరూ మొదలు పృథ్వీరాజ్ కూడా హిరోనే అనుకుంటారు. కానీ సినిమా ఎండింగ్ కు వచ్చేసరికి విలన్ అని తేలిపోతుంది. అంతలా పవర్ ఫుల్ ఉన్న క్యారెక్టర్ ను చేయడంతో పృథ్వీలోని మరో కోణం బయటపడింది. పృథ్వీరాజ్ కు కార్స్ అంటే ఎక్కువ ఇష్టం. ఎప్పుడు కొత్త కారు వచ్చినా దాన్ని కొనేందుకు ప్రయత్నం చేస్తాడు. లంబోర్గిని కారు చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీల వద్ద ఉన్న విషయం తెలిసిందే. పృథ్వీరాజ్ రీసెంట్ గా పొర్షే కారును కొనుక్కున్నాడు. పొర్చ్సే వెహికల్ స్పోర్ట్ కారు. చాలా స్పీడ్ తో వెళ్లగల సామర్థ్యం ఈ కారు సొంతం. దాదాపు దీని ధర రూ. 3 కోట్లకు పైనే ఉంటుంది. ఈ కారు 6 స్పీడ్ జీటీ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ కలిగి ఉంటుంది.
ఇటీవల పృథ్వీరాజ్ డైరెక్టర్ విపిన్ దాస్ డైరెక్షన్ లో గురువాయూరంబాల నడాయిల్ మూవీలో కనిపించాడు. ప్రస్తుతం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంపురాన్ చిత్ర షూటింగ్ లో పృథ్వీ బిజీ బిజీగా గడుపుతున్నాడు. మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాలకు ఇది రెండో భాగం కాగా.. పృథ్వీరాజే లూసిఫర్ సినిమాకు డైరెక్షన్ చేశాడు.
View this post on Instagram
View this post on Instagram