Mosquito : అగ్రరాజ్యాన్ని హడలెత్తిస్తున్న దోమ

Mosquito

Mosquito

Mosquito : అగ్ర రాజ్యం అమెరికాను సరికొత్త వైరస్ హడలెత్తిస్తోంది. అరుదైన దోమల కారణంగా EEE వైరస్ విజృంభిస్తోంది. తాజాగా ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫాలిటిస్ (EEE) వైరస్‌ కారణంగా న్యూ హాంప్‌షైర్‌లోని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా అలర్ట్ అయింది. ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీచేశారు . వ్యక్తిగత రక్షణే దీనికి మార్గమని అధికారులు సూచించారు.

న్యూ హాంప్‌షైర్‌లోని హాంప్‌స్టెడ్ నివాసి అత్యంత అరుదైన ఈస్టర్న్ ఈక్విన్ ఎన్‌సెఫాలిటిస్ వైరస్ బారిన పడి ప్రాణాలు వదిలాడు. న్యూ హాంప్‌షైర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (డీహెచ్‌హెచ్‌ఎస్) నుంచి ఒక ప్రకటన వెలువడింది. వయోజన రోగి తీవ్రమైన కేంద్ర నాడీ వ్యవస్థ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడని.. అనంతరం చికిత్స పొందుతూ అనారోగ్యంతో మరణించాడని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. 2014 నుంచి ఇదే మొదటి మరణం కేసుగా అధికారులు పేర్కొ్న్నారు.

న్యూ హాంప్‌షైర్‌ లో మూడు అంటువ్యాధులను నమోదు చేయగా.. అందులో రెండు ప్రాణాంతకమైనవిగా తెలిపారు. ఇక తాజాగా నమోదైన EEE వైరస్ ప్రమాదకరమని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఇది తీవ్ర అవుతుందని హెచ్చరించారు. ఈ వైరస్ సోకితే 30 శాతం మంది ప్రాణాలు కోల్పోతారని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే పబ్లిక్ పార్కులను మూసివేయాలని సూచించారు. ప్రజలు కూడా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

TAGS