Solar Eclipse 2024 : విశ్వం గురించి వర్ణించేందుకు బహూషా ఎవరికీ తెలియకపోవచ్చు. ఒక వేళ తెలిసిన శాస్త్రవేత్తలకు కూడా సముద్రం ఒడ్డున ఇసుక రేణువు అంత కావచ్చేమో. కొత్త కొత్తవి కనుగొంటున్నా కొద్దీ మానవులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎప్పటికప్పుడు విశ్వాంతరాలలో అద్భుతాలు కనిపిస్తూనే ఉంటాయి.
సూర్య, చంద్ర గ్రహణాల గురించి అందరికీ తెలిసిందే కదా.. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సూర్య గ్రహణం అని, చంద్రునికి సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం అని అంటారు. ఇది చిన్నప్పుడు పాఠాలు చదువుకున్నదే, జరుగుతున్నది కూడా ఇదే. సూర్య గ్రహణంలో సూర్యుడు కనిపించడు.. చంద్ర గ్రహణంలో చంద్రుడు కనిపించడు.
ఏప్రిల్ 8వ తేదీ ఆకాశంలో అద్భుతం జరుగుతుందని నాసా శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఆరోజు జరగబోయే సంపూర్ణ సూర్యగ్రహణం అసాధారణమైనదిగా వర్ణిస్తున్నారు. ఏప్రిల్‌లో జరిగే ఈ ఖగోళ సంఘటన, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో మరియు కెనడాలో విస్తృతంగా ప్రయాణించి, సౌర గరిష్టంగా కొనసాగుతుంది. దీన్ని నాసా, US నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్పియల్ రీసెర్చ్ (NCAR) నిపుణులు ధృవీకరించారు.
ఇలాంటి సూర్య గ్రహణం 50 ఏళ్లలో ఇదే కావడం విశేషం. ఏప్రిల్ 8, 2024న రానున్న సంపూర్ణ సూర్యగ్రహణం మరింత గుర్తుండిపోయేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ రోజు రాత్రి 9.12 గంటల నుంచి అర్ధరాత్రి 1.25 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. భారత్ లో ఎక్కువగా కనిపించదని సైంటిస్టులు చెప్తున్నారు. కెనడా, మెక్సికో, ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో గ్రహణం కనువింధు చేయనుంది.