Married Woman Taught : లైంగిక దాడికి యువకుడి యత్నం.. జీవితాంతం బాధపడేలా బుద్ధి చెప్పిన మహిళ

Married Woman Taught a lesson to Young man
Married Woman Taught a Lesson to Young Man : తన ఇంట్లోకి ప్రవేశించి, తనపై లైంగిక దాడి చేయబోయిన యువకుడికి జీవితాంతం గుర్తుండేలా బుద్ధి చెప్పింది ఓ వివాహిత. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి ధైర్యంగా నిజం చెప్పేసింది. దీంతో అక్కడున్న పోలీసులు జరిగిన సంఘటన ను తెలుసుకొని షాక్ కు గురయ్యారు.
ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలోని కౌశంబి జిల్లాలోని మంజన్ పూర్ పోలీస్ స్టేన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సదరు మహిళ భర్త సౌదీ ఆరేబియాకు ఉపాధి కోసం వెళ్లాడు. అయితే వీరి ఇంట్లో ఎన్నో ఏళ్లుగా ఓ యువకుడు పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సదరు వివాహితపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ఎంత అడ్డు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో వంట గదిలోని కత్తి తో వచ్చి, అతన్ని మాటల్లో పెట్టి అతడి ప్రైవేట్ పార్ట్ ని కోసేసింది. దీంతో ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఇక సదరు వివాహిత, ఆ ప్రైవేట్ పార్ట్ ను సంచిలో తీసుకొని వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పింది. వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వివాహిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక బంధువుల సాయంతో సదరు యువకుడు దవాఖానలో అడ్మిట్ అయ్యాడు. అయితే యువకుడు మాత్రం ఎన్నో ఏళ్లుగా ఆ ఇంట్లో పని చేస్తున్నానని, తనే ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచిందని చెప్పాడు. తన నోట్లో రుమాలు నొక్కి, అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేసిందని, ఆ తర్వాత స్పృహలోకి వచ్చాకే అసలు విషయం తనకు అర్థమైందని చెబుతున్నాడు. అయితే ఇదే విషయమై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇరుగు పొరుగు వారిని ప్రశ్నిస్తున్నారు.