Today Gold Price : హమ్మయ్య కాస్త ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?

Today Gold Price
Today Gold Price : గత నెలలో తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర.. గత వారంరోజులుగా పెరుగుతూ వస్తోంది. రెండు రోజుల్లోనే తులం బంగారంపై రూ. 330 పెరిగింది. మరోవైపు వెండిధర సైతం వరుగా పెరుగుతూ వస్తోంది. గడిచిన మూడు రోజుల్లో కిలో వెండిపై రూ. 2,500 పెరిగింది. అయితే, ఆదివారం బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట లభించింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల్లో ఆదివారం ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,200 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,350 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,550 వద్దకు చేరింది.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో .. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,200 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 62,400 వద్ద కొనసాగుతుంది.చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,800 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,050 వద్ద కొనసాగు తుంది.