Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

Phone Tapping Case

Phone Tapping Case

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావును హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఎస్ఐటీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపైన నాన్ బెయిల్ వారెంట్లు జారీ చేసిన కోర్టు ప్రభాకర్ రావు విజ్ఞప్తిని తిరస్కరించింది. ప్రభాకర్ రావు వర్చువల్ గా విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్లగా న్యాయస్థానం తిరస్కరించి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

కాగా, ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను ఇండియాకు రప్పించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన సెట్ బృందం శ్రవణ్ రావు ఆచూకీని ఇంకా కనుక్కోలేదు. శ్రవణ్ రావు ఆచూకీ కోసం విదేశాలకు వెళ్లే యోచనలో దర్యాప్తు బృందం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లిపోగా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

TAGS