CM Jagan : విజయవాడలో సిఎం జగన్ పై రాయితో దాడి చేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల్లో ఓ మైనర్ తానే దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. అదుపులో ఉన్నవారు మైనర్లు కావడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురి యువకుల ఫోన్ లోకేషన్ తో పాటు ఇతర అంశాలపై విచారణ కొనసాగిస్తున్నారు.
ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలు, ఫోన్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు స్థానికంగా నివాసముండే ఓ యువకుడిని అతని ఐదుగురి స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడు మత్తుమందు సేవిస్తున్నాడని, అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తామని చెప్పి పోలీసులు తీసుకుళ్లారని యువకుడి తల్లి చెబుతోంది. అయితే యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వడ్డెర కాలనీలోని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.