JAISW News Telugu

air travel : ఎయిర్ ట్రావెల్ రంగంలో భారీ సంచలనం.. గంటలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లవచ్చంటే?

air travel

air travel

air travel : ప్రయాణ రంగంలో ఒక అద్భుతం జరగబోతోంది. ఒక విప్లవాత్మకమైన హైపర్ సోనిక్ జెట్ ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే ఇది కేవలం 60 నిమిషాలు (గంట)లో లండన్ నుంచి న్యూయార్స్ చేరుకోగలదు. 2025లో దీన్ని టెస్ట్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. స్టార్టప్ ఇంజినీరింగ్ కంపెనీ వీనస్ ఏరోస్పేస్ దీనిని అభివృద్ధి చేయబడింది. Mach 6కి (3,600mph/5,795km/h), ఇది ధ్వని వేగం కంటే 6 రెట్లు ఎక్కువ.  ఏరోస్పేస్ కంపెనీ వెలోంట్రా భాగస్వామ్యంతో, వీనస్ ఏరోస్పేస్ వచ్చే ఏడాది టెస్ట్ ఫ్లైట్ నిర్వహించాలని యోచిస్తోంది, ఇది ‘హై-స్పీడ్ ఫ్లైట్ ఎకానమీకి’ మార్గం సుగమం చేస్తుంది. సంప్రదాయ విమానాలలా కాకుండా.. ఈ హైపర్‌సోనిక్ జెట్ ఎత్తులో రాకెట్ ప్రొపల్షన్‌కు మారే ముందు టేకాఫ్ కోసం సంప్రదాయ జెట్ ఇంజిన్‌లను ఉపయోగించి సంప్రదాయ విమానం కంటే ఎక్కువ ఎత్తు నుంచి ఎగురుతుంది. సాంకేతికంగా అంతరిక్షం అంచుకు చేరుకోనప్పటికీ ఇందులో ప్రయాణించే వారు భూమి గుండ్రంగా ఉందని చూడగలరు. పైన అంతరిక్ష్యం చీకటిగా ఉందని కూడా చూడగలరని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వినూత్న విమానాలు అపూర్వమైన వేగం, సామర్థ్యాన్ని అందిస్తూ ఎగిరే అనుభవాన్ని పూర్తిగా మారుస్తాయి. భద్రతను నిర్ధారించడం వంటి సవాళ్లు మిగిలి ఉన్నాయి.

Exit mobile version