Manikonda : మణికొండలో భారీ కొండచిలువ.. పరుగులు పెట్టిన జనం

Huge Python in Manikonda
Manikonda : రంగారెడ్డి జిల్లా మణికొండలో 12 అడుగుల కొండచిలువ కలకలం రేపింది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల హిల్స్ కాలనీలో కొండచిలువ సంచరించింది. భారీ కొండచిలువ ఒక్కసారిగా కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు.
స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ కొండచిలువను తాను తెచ్చుకున్న సంచిలో బంధించాడు. కొండచిలువను బంధించే సమయంలో చూడడానికి ప్రజలు ఎగబడ్డారు అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడానికి స్నేక్ క్యాచర్ తీసుకు వెళ్లాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.