Nitish Kumar Reddy : నితీశ్ కుమార్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ సీజన్ లో బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడు. ఇప్పటికే 239 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాప్ సెంచరీలతో కదం తొక్కుతున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున రంజీ క్రికెట్ ఆడుతున్నాడు.
నితీశ్ కుమార్ రెడ్డి గత సీజన్ లో కూడా సన్ రైజర్స్ కు సెలక్టయిన పెద్దగా అవకాశాలు రాలేవు. కానీ ఈ సీజన్ లో పంజాబ్ తో మ్యాచ్ లో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో కీలకమైన 67 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. నితీశ్ పేస్ బౌలింగ్ కూడా చేయగడు. దీంతో నితీశ్ పై భారత మాజీ క్రికెటర్లు అంచనాలు పెంచుకున్నారు. భవిష్యత్తులో ఇండియా క్రికెట్ కు ఆడగల సమర్థుడు నితీశ్ కుమార్ రెడ్డి అని చెబుతున్నారు.
అయితే ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ నిర్వహించే టీ 20 లీగ్ లో నితీశ్ కుమార్ రెడ్డి భారీ ధర పలికాడు. 15.60 లక్షలకు గోదావరి టైటాన్స్ నితీశ్ రెడ్డి ని సొంతం చేసుకుంది. గత సీజన్ లో హనుమ విహారి ఒక్కడే 6.60 లక్షల ధర తో అత్యంత ఖరీదైన ఆటగాడు కాగా.. ఈ సారి నితీశ్ కుమార్ రెడ్డి 15.60 లక్షల ధర పలికి రికార్డు బ్రేక్ చేశాడు.
గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, ఉత్తరాంద్ర లయన్స్ అనే ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో నితీశ్ రెడ్డికి ఇంత భారీ ధర పలకడం చూసి నితీశ్ భావొద్వేగానికి గురయ్యాడు. నితీశ్ కుమార్ రెడ్డి పై సన్ రైజర్స్ భారీ గానే ఆశలు పెట్టుకుంది. ప్లే ఆప్స్ తో పాటు మిగతా మ్యాచుల్లో రాణించి సన్ రైజర్స్ కు కప్ తేవాలని కోరుకుంటుంది.
Andhra Pradesh Premier League witnesses history as Nitish Kumar Reddy becomes the most expensive player ever picked! pic.twitter.com/tSC0HeANXi
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) May 16, 2024