JAISW News Telugu

Betting : ప్రకాశంలోని ఆ రెండు సెగ్మెంట్లకు భారీ పందెం.. రాష్ట్రానికే హైలట్ గా మారనుందా?

Betting

Betting

Betting : ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి, చీరాల నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ భారీగా పెరుగుతోంది. మొదట్లో రెండు చోట్లా వైసీపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది. కానీ పరిస్థితులు రాను రాను మారినట్లుగా కనిపిస్తున్నాయి. దీంతో ఆయా పార్టీల మద్దతు దారులు బెట్టింగ్ లను పెంచుతున్నారు.

దర్శి నియోజకవర్గం..
ఈ నియోజకవర్గాని వైసీపీ తన అభ్యర్థిని ముందుగానే ప్రకటించి, కానిస్టెన్సీలో బాగా పట్టు ఉన్న శివప్రసాద్ రెడ్డిని బరిలోకి దింపింది. అధినాయకుల ఆదేశాల మేరకు ఆయన ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించారు. అప్పట్లో టీడీపీకి నియోజకవర్గానికి ఇన్ చార్జి కూడా లేకపోవడంతో ఆ స్థానాన్ని అధికారికంగా జనసేనకు కేటాయించారు.

ఫలితంగా స్థానిక పరిస్థితులను బట్టి వైఎస్సార్సీపీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఊహించని పరిణామాలు సీన్ మార్చేశాయి. టీడీపీ రంగంలోకి దిగి డాక్టర్ లక్ష్మి అనే మహిళా అభ్యర్థిని బరిలోకి దింపింది. టీడీపీ, జనసేన పార్టీలు పోటీని మరింత తీవ్రతరం చేశాయి. ఫలితంగా పెరిగిన ప్యాకేజీలు, ప్రలోభాలకు వైసీపీ స్పందించినా టీడీపీ అభ్యర్థి మాత్రం ధీటుగా బదులిచ్చింది.

ఈ కూటమికి ప్రధాన సామాజిక వర్గాలు మద్దతివ్వగా, వైసీపీకి మద్దతిస్తున్న సామాజికవర్గంలో చీలిక వచ్చినట్లు చివరి వరకు వైసీపీకి తెలియలేదు. పోలింగ్ రోజున టీడీపీ కూటమి బలంగా కనిపించింది. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ ఇక్కడ పోటీ తీవ్రంగా ఉండడం గమనార్హం.

తొలుత వైసీపీ గెలుపు కోసం బెట్టింగ్ లు నిర్వహించిన వారు రూపాయికి రూపాయిన్నర పందెం వేశారు. ఇప్పుడు ఒక్క రూపాయికే బెట్టింగ్ జరుగుతుంది. వైసీపీకి 10 వేల ఆధిక్యం వస్తుందన్న తొలి పందెం ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పుడు మండలాల వారీగా ఆధిపత్యంపై కూడా పందాలు జరుగుతుండటంతో టీడీపీ గెలుస్తుందని ఎక్కువ మంది బెట్టింగ్ కాస్తున్నారు.

చీరాల నయోజకవర్గం..
చీరాల అసెంబ్లీ స్థానానికి జరిగే రేసుకు సంబంధించి పోలింగ్ అనంతరం బెట్టింగ్ లు పెరిగాయి. ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందే వైఎస్సార్సీపీ అనుకూల ఫలితాలు సాధిస్తుందని జోస్యం చెప్పారు. సీనియర్ నేత, ఎమ్మెల్యే బలరాం వెంకటేష్ అభ్యర్థిగా ఉండడం, నియోజకవర్గంలో బీసీ, బలహీనవర్గాల ఓటర్లు ఉండడం ఈ అంచనాకు దోహదం చేసింది.

అయితే కాంగ్రెస్ వైపు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రంగంలోకి దిగడంతో ఫలితంపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ కూటమిలో ఎవరు గెలుస్తారనే దానిపై భారీ బెట్టింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ తరుఫున పోటీ చేస్తున్న ఆమంచి వైసీపీ ఓట్లను చీల్చే అవకాశం ఉంది.

దీనికితోడు టీడీపీ కూటమి అభ్యర్థి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం, వైసీపీ పోల్ మేనేజ్‌మెంట్ లోపించడం కూడా ఒక కారణం. మొత్తంగా పరిస్థితిని పరిశీలిస్తే టీడీపీ విజయావకాశాలు మెరుగయ్యాయని, వైసీపీ బలహీనపడిందని భావించిన ఓటర్లు తమ పందేలను సర్దుబాటు చేసుకున్నారు.

ఈ రెండు నియోజకవర్గాల్లో తుది ఫలితాలతో సంబంధం లేకుండా వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ కూటమి నుంచి గట్టి పోటీ ఉంది. దీంతో బెట్టింగ్ పెరిగిందని, విజయావకాశాలు ఏకపక్షంగా లేవనే సంకేతాలు అందుతున్నాయి. 

Exit mobile version