Strange love story : ప్రేమను ఎరగా వేసి ఓ ఇంటిదైన యువతి.. ఇదో వింత ప్రేమ కథ..

strange love story

strange love story

strange love story : ప్రతీ మనిషి జీవితంలో మోస పోవడం.. మోసం చేయడం కామనే..! ఎలా మోసపోయానని ఒకసారి తనకు తాను ఆలోచిస్తే మరోసారి మోసపోలేరు. 20 మంది యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిన ఒక యువతి కథ అప్పట్లో పెద్ద వైరల్ టాపిక్ గా మారింది. ఇది సోషల్ మీడియాను కుదుపు కుదిపింది. యువతి అంటే అందం మాట తీరుతో మరింత ఆకర్షించుకుంది. పేద కుటుంబంలో పుట్టిన ఒక యువతి అందం, ప్రేమను ఎరగా వేసి 20 మందిని మోసం చేసి ఒక ఇంటిదైంది. అసలు కథ ఏంటంటే? ఈ సంఘటన 2016లో చైనాలో జరిగింది. ఒక చైనీస్ బ్లాకర్ ప్రౌడ్ కియాబా తన బ్లాగ్ లో ఒక కేసు గురించి రాశారు. గ్జియాలి అనే ఒక యువతి తన వద్దకు వచ్చింది. తన గురించి వివరాలు చెప్పింది. అందులో ఆసక్తి కరమైనది ఏంటంటే. తనకు 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారట. అంరినీ ఒక్కొక్క ఐఫోన్ 7 (ఆ సంవత్సరంలో అదే యాపిల్ రిలీజ్ మోడల్) కొనివ్వాలని ప్రేమగా అడిగింది. వారంతా ఒకే చెప్పి అందరూ ఒక్కొక్కటి ఇచ్చారు. ఇలా మొత్తం 20 ఐఫోన్లు ఆమె చేతికి వచ్చాయి. వచ్చిన ఐఫోన్లను $17,815 (రూ. 14 లక్షల 87 వేల 93)కు విక్రయించింది. తను నివసించే ఇంటికి డౌన్ పేమెంట్ చేసింది. గ్జియోలి పేద కుటుంబానికి చెందిన యువతి. ఆమె తెలివి తేటలతో ఒక ఇంటిది (సొంతిళ్లు కొనుక్కుంది) అయ్యింది. అప్పట్లో ఈ వార్త చైనాలో సంచలనంగా మారింది.

TAGS