భారీ సైజు ఉన్న వస్తువులను ఎలాగో విమానాల్లో, షిప్ ద్వారా తీసుకెళ్లలేరు. పెద్ద సైజుల్లో ఉన్న బాయిలర్‌లను భారీ ట్రక్కులు తీసుకెళ్తున్న దృశ్యాలు హర్యానా రోడ్లపై కనిపించాయి.
గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవు నుంచి 1,150 కిలోమీటర్ల దూరంలో హర్యానాలోని పానిపట్‌కు సమీపంలోని చమురు శుద్ధి కర్మాగారాల్లో ఉపయోగించే కోక్ బాయిలర్‌లను ఇవి మోసుకెళుతున్నట్లు గుర్తించారు. ఈ ట్రక్కులకు దాదాపు 400 టైర్లు ఉండటం విశేషం. కేవలం రోజుకు 25 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేస్తాయి. ఇప్పటి వరకు 200 టైర్ల వరకు మార్చారు. వీటి బరువు దాదాపు 8 లక్షల కిలోలు ఉంటుందని సంబంధింత వర్గాలు పేర్కొంటున్నాయి.
ఏడాది నుంచి ప్రయాణం చేస్తున్న ఇవి ఇంకా గమ్యస్థానాలకు చేరుకోలేవు. ఇటీవల, ఈ ట్రక్కులు నర్వానాలోని సిర్సా బ్రాంచ్ కెనాల్‌ను దాటాడానికి ఏకంగా తాత్కాలిక వంతెనను నిర్మించారు. దాని నుంచి ట్రక్కును విజయవంతంగా దాటించారు. 3,500 హార్స్‌పవర్‌తో హర్యానా రోడ్లపై ప్రయాణిస్తున్నాయి. ఇవి ప్రయాణిస్తున్న మార్గంలో కొన్ని చోట్ల రోడ్డు సరిగ్గా లేకపోవడంతో వాటిని బాగు చేస్తున్నారు. దాదాపు 250 ఉద్యోగులు పని చేస్తున్నారంటే వీటిని ఎలా మెయింటెన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
భారీ ట్రక్కలు నడిపించాలంటే దాని పక్కన నిలబడి పనిచేసే వారుండాలి. రోడ్లపై కరెంట్ తీగలను తీసేసి.. ఎలక్ట్రిసిటీ వారితో కనెక్ట్ అయ్యే వారు ఉండాలి. దీంతో పాటు అనేకమంది నిరంతం దాని మెయింటెన్స్ చేస్తూ ఉండాలి. ఈ కోక్ బాయిలర్లకు ఫుల్ డిామండ్ ఉంటుంది. వీటి తయారీ, వినియోగం అంతా ఒక క్రమపద్ధతిలో సాగుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా వీటిని గమ్యస్థానాలకు చేర్చుతుంటారు.