CM Revanth : ఏపీ కొత్త ప్రభుత్వానికి స్నేహ హస్తం – తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth : ఏపీలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో స్నేహంగా ఉంటామని తిరుమలలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్ తన మనవడి పుట్టువెంట్రుకలను మొక్కుగా చెల్లించారు. అనంతరం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సదర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలతో ఎటువంటి వివాదాలు పెట్టుకోమని అన్నారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ఏపీ కొత్త ప్రభుత్వానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నీటి వివాదాలను కూడా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుంటామని వెల్లడించారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.