JAISW News Telugu

Bhashyam Praveen : పింఛన్ల పంపిణీ కోసం ‘భాష్యం ప్రవీణ్’ వేసిన గొప్ప ముందడుగు

A great step taken by 'Bhashyam Praveen' for distribution of pensions

A great step taken by ‘Bhashyam Praveen’ for distribution of pensions

Bhashyam Praveen : వైసీపీ కుట్రలు, కుతంత్రాలను చేధిస్తూ టీడీపీ దూసుకెళుతోంది. పింఛన్ల పంపిణీ జరగకుండా టీడీపీ అడ్డుకుంటుందన్న విష ప్రచారాలను తరిమికొట్టేందుకు టీడీపీ నేతలంతా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా పెదకూరపాడు ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఈ పింఛన్ల పంపిణీ కోసం వేసిన గొప్ప ముందడుగు అందరికీ స్ఫూర్తినిచ్చేలా ఉంది. ఆయన మార్గంలో ఇప్పుడు టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జీలు, ఎమ్మెల్యేలు అందరూ నడుస్తున్న పరిస్థితి నెలకొంది..

ఇంటింటికి పింఛన్ల పంపిణీ చేపట్టాలని పెదకూరపాడు కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గొప్ప ముందడుగు వేశారు. గతంలో మాదిరిగానే ఇంటింటికి వెళ్లి వృద్ధులు వితంతువుల దివ్యాంగుల తదితర వారికి పింఛన్లను పంపిణీ చేయాలని వారి ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని పెద్దకూరపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు స్వయంగా పెదకూరపాడు మండల ఎంపీడీవో మల్లేశ్వరికి దగ్గరికి జిల్లా తెదేపా కార్యదర్శి అర్తిమళ్ళ రమేష్ తో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాలంటీర్లను నగదు తదితర వాటిని పంపిణీ చేయడానికి వీలులేదని ఆదేశాలు జారీ అయ్యాయని ఈ నేపథ్యంలో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కోసం సచివాలయాలు పంచాయితీ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. సచివాలయాల వద్దకు వెళ్లాలని ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు.

అవసరమైతే టీడీపీ నేతలమైన మేము ఈ పింఛన్ల పంపిణీలో చొరవ తీసుకొని ప్రతి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు అందించే బాధ్యత తీసుకుంటామని భాష్యం ప్రవీణ్ సంచలన పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నేతలందరూ ఈ క్రతువులో పాల్గొనాలని కోరారు.

పింఛన్లు పంపిణీ చేయలేకపోవటానికి చంద్రబాబు నాయుడు కారణమని వైకాపా చేస్తున్న ఆరోపణలు నీతి బాహ్యమైనవి అని భాష్యం ప్రవీణ్ అన్నారు. వెంట న్యాయవాది సరిపుడి నాగేశ్వరరావు, అజీముల్లా, మక్కెనసాగర్ జాగర్లమూడి రఘు, రత్న, ముంతాజ్ తదితరులు ఉన్నారు..

Exit mobile version