JAISW News Telugu

Jewelery shop Robbery : జ్యువెలరీ షాపులో భారీ దొంగతనం

Jewelery shop Robbery

Jewelery shop Robbery

Jewelery shop Robbery : మేడ్చల్ జిల్లా తూంకుంటలోని జ్యువెలరీ షాపులో బుధవారం భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో 480 గ్రా. బంగారం, 80 కిలోల వెండి ఆభరణాలు, రూ.లక్షన్నర నగదు దొంగిలించారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. తూంకుంటకు చెందిన జగదీశ్ అనే వ్యాపారి హైవే పక్కన జ్యువెలరీస్ పేరుతో షాపు నడుపుతున్నాడు. రోజూలాగే మంగళవారం రాత్రి జగదీశ్ కొడుకు గణేశ్ షాపు క్లోజ్ చేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత జ్యువెలరీ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి, 48 తులాల బంగారు, 80 కిలోల వెండి ఆభరణాలు, కొంత నగదును ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం షాపులో దొంగలు పడినట్లు తెలుసుకున్న జగదీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాలనగర్ డీసీపీ సురేశ్, మేడ్చల్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, సీఐ శ్రీనాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. ముగ్గురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version