JAISW News Telugu

Extramarital Relationship : మంచి భర్త..ఇద్దరు పిల్లలు..ప్రియుడితో వివాహేతర సంబంధం.. ఆ ఇల్లాలు చేసిన పనికి..

Extramarital Relationship

Extramarital Relationship, dead body

Extramarital Relationship : పచ్చని కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. తల్లి లేదా తండ్రి దారితప్పి తమ పిల్లల భవిష్యత్ ను కాలరాస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు పెచ్చుమీరుతున్నాయి.  హైదరాబాద్ లోని ఓ వివాహిత చేసిన తప్పు ఆమె కుటుంబాన్ని రోడ్డుపాలు చేసింది. మంచి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నా..ఆమె అక్రమ సంబంధం వల్ల ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది.

హైదరాబాద్ లోని ఎల్లారెడ్డిగూడ జయప్రకాశ్ నగర్ లో ఓ అపార్ట్ మెంట్ లో శ్రీకాంత్, శ్రీలత(పేరు మార్చాం) అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే శ్రీలత పెళ్లికి ముందే రాజేశ్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపింది. పెళ్లి తర్వాత కూడా వారి వ్యవహారం కొనసాగుతోంది. అయితే ఈ విషయం భర్తకు తెలిస్తే ఇబ్బంది అని భావించిన రాణి..భర్త శ్రీకాంత్(40)ను చంపాలని నిర్ణయించుకుంటుంది. ఈ విషయం రాజేశ్ కు చెప్పగా..అతడు కూడా ఒప్పుకుంటాడు.

ఈ నేపథ్యంలో రాజేశ్ తనకు సనత్ నగర్ ప్రాంతంలో పరిచయం ఉన్న రౌడీ షీటర్ రాజేశ్వర్ రెడ్డి సాయం కోరాడు. రాజేశ్వర్ రెడ్డిపై ఇప్పటికే 8 మర్డర్ కేసులు ఉన్నాయి. రాజేశ్వర్ రెడ్డి సూచనతో రాజేశ్ మహ్మద్ మైతాబ్ అలియాస్ బబ్బన్ అనే వ్యక్తి వద్దకు వెళ్లాడు. శ్రీకాంత్ హత్యకు సహకరించాలని కోరాడు. ఇందుకు డబ్బులు ఇస్తానని చెప్పడంతో రాజేశ్వర్ రెడ్డి, మైతాబ్ ఒప్పుకున్నారు. ఈక్రమంలో ఫిబ్రవరి 1న శ్రీకాంత్ తన పిల్లలను స్కూల్ లో దించేందుకు వెళ్లాడు. ఇంతలో రాజేశ్, రాజేశ్వర్ రెడ్డి, మైతాబ్ లను శ్రీలత ఇంటికి పిలిపించి బాత్రూంలో దాచింది.

శ్రీకాంత్ ఇంటికి రాగానే లోపలి నుంచి ఇంటి గడియ పెట్టింది. వెంటనే బాత్రూంలో దాక్కున్న ముగ్గురు బయటకు వచ్చి జిమ్ లో వాడే రాడ్లు, డంబెల్స్ తో శ్రీకాంత్ పై విచక్షణారహితంగా దాడి చేశారు. తనను చంపొద్దని శ్రీకాంత్ వారిని ఎంతో బతిమాలుకున్నాడు. అయినా వినకుండా క్రూరంగా అతన్ని ఆ ముగ్గురూ చంపేశారు. డెడ్ బాడీని బాత్రూంలో పడేసి వెళ్లిపోయారు. తర్వాత శ్రీలత ఇంటిలోని మరకలను తుడిచేసి..తన భర్త గుండెపోటుతో మరణించాడని బంధువులను నమ్మించి అంత్యక్రియలు పూర్తిచేసింది.

అయితే శ్రీకాంత్ ను హత్య చేసిన తర్వాత రాజేశ్వర్ రెడ్డి వికారాబాద్ కు పారిపోయాడు. హత్య విషయం బయటకు తెలిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పి 3 నెలల పాటు అక్కడే ఉన్నాడు. అయితే శ్రీకాంత్ ను హత్య చేసే సమయంలో అతడు ఎంతగానో ప్రాథేయపడిన చంపడం వల్ల రాజేశ్వర్ తీవ్రంగా మానసికంగా ఇబ్బంది పడ్డాడు. పదే పదే ఆ విషయం గుర్తుకువచ్చి  అతడి వల్ల కాకపోవడంతో పోలీసులకు దగ్గరకు వచ్చి అసలు విషయం చెప్పి లొంగిపోయాడు.

దీంతో పోలీసులు శ్రీలత సహ నిందితులందరినీ జైలుకు పంపారు. అయితే శ్రీకాంత్ చనిపోవడం, శ్రీలత జైలుకు వెళ్లడంతో పిల్లలు దిక్కులేనివారయ్యారు. తల్లి చేసిన పాపానికి జీవితకాలపు శిక్షను ఆ పిల్లలు మోయాల్సిరావడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Exit mobile version