JAISW News Telugu

Ramgopal Varma : అమ్మాయి అలా చేస్తే కిక్ వచ్చేది.. రాంగోపాల్ వర్మ

Ramgopal Varma

Ramgopal Varma With Girls

Ramgopal Varma :  సెన్సేషనల్ డైరెక్టర్  రాంగోపాల్ వర్మ చేసే వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదమవుతుంటాయి.  ఇక మహిళల విషయంలో పలు సందర్భాల్లో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.  తమ వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నాడంటూ మహిళా సంఘాలు ఆర్జీవీపై  ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆందోళనలకు దిగిన సందర్భాలు సైతం ఉన్నాయి.  ఏ విషయాన్నైనా తనదైన శైలిలో మొహమాటం లేకుండా చెప్పడం రాంగోపాల్ వర్మకు ముందు నుంచీ ఉన్నదే. సినిమాల విషయంలో కావచ్చు.. లేదా రాజకీయాల గురించి కావచ్చు… తనదైన శైలిలో నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆర్జీవీని కొందరు సమర్థిస్తుండగా, మరి కొందరు వ్యతిరేకిస్తుంటారు.

అమ్మాయిలతో మందు తాగుతూ.. డ్యాన్స్ చేస్తూ..

ఆర్జీవీ పార్టీలకు ప్రాధాన్యమిస్తుంటాడు. ఇందులో అమ్మాయిలతో మందు తాగుతూ, డ్యాన్స్ చేస్తున్న ఫొటోలను షేర్ చేస్తుంటాడు. ఈ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నీ వ్యక్తిగత ఫొటోలు ఇలా సోషల్ మీడియాలో పెట్టడం అవసరమా అని కొందరు వ్యతరేకిస్తుండగా, మరి కొందరు ఎంజాయ్ చేయడానికే పుట్టాడంటూ మరికొందరు పొగడ్తలతో ముంచెత్తుతుంటారు.

రోమాన్స్ పై మరోసారి ఓపెన్..

రోమాన్స్ విషయంలో మరోసారి ఓపెన్ అయ్యాడు ఆర్జీవీ.  తన లైఫ్ లో ఎంతో మంది అమ్మాయితో రోమాన్స్ చేసి ఎంజాయ్ చేశానని పలు సందర్భాల్లో చెప్పాడు. తనకు సెక్స్ అంటే చాలా ఇష్టమని ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. తాజాగా మరోసారి రోమాన్స్ విషయంలో ఓపెన్ అయ్యాడు. తనకో అమ్మాయితో ఎఫైర్ ఉండేదని చెప్పుకొచ్చాడు.  ఆ అమ్మాయితో  రోజూ సెక్స్ చేసేవాడినని చెప్పాడు. అయితే సెక్స్ తర్వాత అమ్మాయి బిహేవియర్ చూసి షాకయ్యాయని చెప్పాడు. సెక్స్ తర్వాత ఆ అమ్మాయి పక్కకు వెళ్లి పుస్తకం తీసి చదివేదన్నారు. సెక్స్ తర్వాత ఆ మూడ్ నుంచి బయటకు రావడానికి ఆ అమ్మాయి చేసిన పని తనకు షాకింగ్ అనిపించిందన్నారు. సెక్స్ అయ్యాక మగవాళ్లు మాత్రమే ఇలా తన పని అయిపోయిందని పక్కకు జరుగుతుంటారని, ఫస్ట్ టైం ఒక అమ్మాయిని అలా చూశానని చెప్పుకొచ్చాడు.

Exit mobile version