A Gift For Sonia Gandhi : సోనియాకు కానుక.. గెలుపు సంకేతాలే అవి.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 

A Gift For Sonia Gandhi

A Gift For Sonia Gandhi

A Gift For Sonia Gandhi : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. అభ్యర్తులు కాళ్లకు చక్రాలు కట్టుకొని తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు. పోలింగ్ కు మరో 12 రోజుల సమయం మాత్రమే ఉండడంతో  ప్రత్యర్థి పార్టీల నుంచి నాయకులను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఈసారి తామే విజయం సాధిస్తామంటూ ఎవరి ధీమాలో వారు ఉన్నారు.

అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతున్నది. డిసెంబర్ 9  కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేస్తుందని, ఆ రోజు సోనియా గాంధీకి జన్మదిన కానుకగా ఇస్తామని రేవంత్ చెబుతున్న తీరు ఆత్మ విశ్వాసమా, ఓవర్ కాన్ఫిడెన్సా అనే చర్చ మొదలైంది.  క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పుంజుకుందని, ఈసారి ఎలాగైనా అధికారం నిలబెట్టుకుంటామని చెబుతున్నాడు. అలాగే బీజేపీ కేవలం కాంగ్రెస్ ను ఓడించడానికే పోటీలో ఉందని, అధికారం కోసం కాదని రేవంత్ ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పై పెరిగిన వ్యతిరేకత కూడా కాంగ్రెస్ కు లాభిస్తుందని చెబుతున్నారు.  ఎలాగైనా ఈసారి అధికారం కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని చెబుతున్నాడు.

బీఆర్ఎస్ ను గెలిపించడానికి బీజేపీ, ఎంఐఎం ఒక్కటయ్యాయని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో, రాష్ర్టం వచ్చిన తర్వాత ఎప్పుడు ఇలా విమర్శలు రాలేదని, ఇందుకు తన పని తీరే నిదర్శనమని చెబుతున్నారు.  ఎంఐఎం తనను ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని, గాంధీ భవన్ ను ఆర్ఎస్ఎస్ భవన్ గా మార్చుతున్నారని ఆరోపించడం వెనక బీఆర్ఎస్ ను గెలిపించాలనే ఉద్దేశమే కనిపిస్తుందంటున్నారు. అధికార పార్టీలో ఓటమి భయం మొదలయ్యాకే ఎంఐఎం ఈ చర్చను లేవనెత్తిందంటున్నారు. గత ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, అప్పుడు ఈ ఆరోపణలు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి.

మంత్రి కేటీఆర్ పైనా విమర్శలు

మంత్రి కేటీఆర్ పైనా నిప్పులు చెరుగుతున్నాడు రేవంత్. తన కన్నా చిన్నవాడని, వయసు బేధం లేకుండా ఇష్టామొచ్చినట్లు మాట్లాడడం అతని అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేసీఆర్ కూడా తన కొడుకు కేటీఆర్ ను సరిదిద్దుకోవడం లేదు. మరింత ఉసిగొల్పుతున్నట్లు అర్థమవుతుందన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ ప్యాక్ గా తన మీద పడుతుందని, కానీ తాను ఒక్కడినే పోరాటం చేస్తున్నానని చెబుతున్నారు.

తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలు, అధికార పార్టీ ఓటమి భయం కాంగ్రెస్ అధికారంలోకి రావడం సంకేతాలను చెబుతున్నారు.

TAGS