Bird Flu : భారత్ లో నాలుగేండ్ల చిన్నారికి బర్డ్ ఫ్లూ
Bird Flu : పశ్చిమ బెంగాల్ కు చెందిన నాలుగేళ్ల చిన్నారికి బర్డ్ ఫ్లూ హెచ్9ఎన్2 వేరియంట్ సోకిందని డబ్ల్యూహెచ్ఓ మంగళవారం తెలిపింది. మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకడం ఇండియాలో ఇది రెండో సారి అని తెలిపింది. 2019లో ఫస్ట్ కేసు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ వివరించింది. ఫిబ్రవరిలో చిన్నారి అనారోగ్యం బారినపడడంతో ఆమెను కుటుంబ సభ్యులను హాస్పిటల్ లో చేర్పించారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, జ్వరంతో బాధపడుతున్న ఆ చిన్నారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత కొద్ది రోజు క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆ చిన్నారి ఇంటి సమీపంలో కోళ్లు ఎక్కువగా ఉండేవని ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే ఆ కుటుంబంలో మరెవరికీ ఈ వైరస్ నిర్ధారణ కాలేదని తెలిపింది.
కాగా, రాష్ట్రంలో ఎక్కడా ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. మాల్దా జిల్లాకు చెందిన నాలుగేండ్ల చిన్నారికి జనవరిలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందని, తర్వాత ఆమె కోలుకున్నదాని తెలిపారు.