Ambulance : అంబులెన్స్‌కి దారి ఇవ్వని కారుకు రూ.2.5 లక్షల ఫైన్, లైసెన్స్ రద్దు..!

Ambulance : చావుబతుకుల్లో ఉన్న రోగిని తరలించే అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా రోడ్డుపై అడ్డంకులు సృష్టించిన కారు యజమానికి కేరళ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. అతడిని పట్టుకుని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతోపాటు రూ.2.5 లక్షల జరిమానా విధించారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఓ డ్రైవర్‌ బాధ్యతారాహిత్యానికి పాల్పడినందుకు కేరళ పోలీసులపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కేరళలో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ కారు నడుస్తోంది. దాని వెనకే అంబులెన్స్ వస్తోంది. అంబులెన్స్ రోగి పరిస్థితి విషమంగా ఉన్నందున, డ్రైవర్ అంబులెన్స్‌ను వేగంగా నడుపుతున్నాడు. అదే సమయంలో అంబులెన్స్ సైరన్ కూడా మోగుతోంది. అయినా కూడా కారు అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదు. దీంతో అంబులెన్స్ డ్రైవర్ కూడా కారును పక్కకు వెళ్లమని హారన్ మోగించాడు. సైరన్, హారన్ ఒకేసారి మోగించినా కారు డ్రైవర్ లో చలనం రాలేదు. అడ్డంగా అలాగే ఉంచాడు.

ఇలా కొన్ని కిలోమీటర్లు నడిపిన తర్వాత పోలీసులు కారును పట్టుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంబులెన్స్ డ్రైవర్‌ను కూడా ప్రశ్నించారు. అతడు అందించిన సమాచారం మేరకు కారు నడిపిన కారు యజమాని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి రూ.2.5 లక్షల జరిమానా విధించారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం, అత్యవసర పరిస్థితుల్లో వాహనాలకు దారి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి డ్రైవర్‌పై ఉంది. దీనిని ఉల్లంఘించినందుకు, ట్రాఫిక్ పోలీసులు అతనికి జరిమానా విధించారు.  అతని లైసెన్స్‌ను కూడా రద్దు చేశారు.

TAGS