Committed suicide : పెన్ను కోసం గొడవ.. భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

committed suicide : పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెన్ను విషయంలో స్నేహితురాలితో ఏర్పడిన స్వల్ప వివాదం తలెత్తిన క్రమంలో ఓ విద్యార్థిని ఏకంగా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్ లోని బొల్లాపల్లి మండలం వెల్డటూరుకు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్ లో ఉంటోంది. శనివారం (నవంబరు 16) ఉదయం హాస్టల్ లో ఉన్న సమయంలో తన స్నేహితురాలితో పెన్ను విషయంలో స్వల్ప వివాదం జరిగింది.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష హాస్టల్ భవనంలోని నాలుగో ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా కిందకు దూకింది. హాస్టల్ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని అనూష మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళాశాల యాజమాన్యం ద్వారా విషయం తెలుసుకున్న నరసరావుపేట ఆర్డీవో హేమలత, తహసీల్దార్ వేణుగోపాల్, నరసరావుపేట రూరల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.

TAGS