innovatively : కొడుక్కి వినూత్నంగా పేరు పెట్టిన తండ్రి

Name innovatively : ఆధునిక కాలంలో పిల్లలకు పేర్లు పెట్టాలంటే ట్రెండీగా ఉండే విధంగా తల్లిదండ్రులు తీవ్రంగా సెర్చ్ చేస్తారు. తర్వాత ఓ మంచి పేరు సెలెక్ట్ చేసుకుంటారు. అంతేకాదు పేరు పెట్టేటప్పుడు ట్రెండీగా ఉండడంతో పాటు జ్యోతిష్యం పరంగా కూడా అద్భుతంగా ఉంటేనే పేరు పెడతారు. కానీ ఓ తండ్రి తన బిడ్డకు పెట్టిన పేరు వెరైటీ అని పేర్కొనవచ్చు. నిజానికి ఇది ఒక పేరేనా అని కూడా భావించవచ్చు. ఇదేం పేరు అని ఆశ్చర్యపోనూవచ్చు.

అసలు విషయం ఏంటంటే.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సిహెచ్ రాఘవేంద్ర తన కుమారుడికి వినూత్నంగా పేరు పెట్టారు. కుల, మత ప్రస్తావన లేకుండా ‘సీహెచ్ వన్ టూ సిక్స్’ అని నామకరణం చేశారు. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ లాంటి అన్ని ధ్రువపత్రాల్లోనూ ఇదే పేరును నమోదు చేయించారు. అయితే అభ్యుదయ భావాలు, సామాజిక అంశాలపై పట్టు గల రాఘవేంద్ర తన కుమారుడికి మంచి పేరు నామకరణం చేయాలని భావించారు. అది కూడా ఆ పేరు దేశభక్తిని చాటి చెప్పాలి కానీ.. ఏ కులాన్ని.. ఏ మతాన్ని ప్రతిబింబించేలా ఉండకూడదన్నది ఆ తండ్రి అభిప్రాయం. వన్ అంటే I, టూ అంటే AM, సిక్స్ అంటే INDIAN.. ఐ యామ్ ఇండియన్ అనే అర్థం వచ్చేలా, మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పడానికి ఈ పేరు తన కుమారుడికి పెట్టినట్లు తండ్రి తెలిపారు.

TAGS