JAISW News Telugu

Father : పిల్లల అల్లరి చేస్తున్నారని బెదిరించే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకున్న తండ్రి

FacebookXLinkedinWhatsapp

Father Died : ఓ తండ్రి తన పిల్లల అల్లరిని అణచివేసేందుకు ప్రయత్నించి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. పొరపాటున ఉరివేసుకుని చిన్నారుల కళ్ల ముందే తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన విశాఖపట్నంలోని గోపాలపట్నంలో చోటుచేసుకుంది. రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌గా పనిచేస్తున్న బీహార్‌కు చెందిన చందన్ కుమార్ (33) గత ఐదేళ్లుగా విశాఖపట్నంలో నివసిస్తున్నాడు. నగరంలోని 89వ వార్డులోని కొత్తపాలెంలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. చందన్ కుమార్‌కు ఏడేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు. చందన్ కుమార్ వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు.

బుధవారం రాత్రి పిల్లలిద్దరూ చందన్ కుమార్ చొక్కా జేబులోంచి కరెన్సీ నోట్లను తీసి పనికిరాకుండా చింపేశారు. దీంతో చిన్నారులపై చందన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే చందన్ కుమార్ భార్య అతన్ని అడ్డుకుంది. ఈ సందర్భంగా చందన్ కుమార్ భార్యతో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఇంట్లో తనను ఇబ్బంది పెడుతున్నారని, ఒత్తిడి చేస్తున్నారని, ఇలా చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని చందన్ కుమార్ కుటుంబ సభ్యులను బెదిరించాడు. కానీ ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు చీర కట్టి మెడకు చుట్టుకున్నాడు. దీంతో భార్య, పిల్లలను భయపెట్టేందుకు ప్రయత్నించాడు.

కానీ అంతలోనే మెడకు చుట్టుకున్న చీర బిగుసుకుపోయింది. వెంటనే స్పందించిన భార్య అతడిని కూర్చోబెట్టి మెడలోని చీరను తీసేసింది. అప్పటికే చందన్ కుమార్ తుది శ్వాస విడిచారు. భర్తను కాపాడేందుకు భార్య చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో చందన్ కుమార్ మృతి చెందాడు. శాంతి కోసం భార్యాబిడ్డలను బెదిరించే ప్రయత్నంలో ఒంటరిగా తెలియని లోకాలకు వెళ్లాడు. చందన్ కుమార్ భార్య ఫిర్యాదు మేరకు గోపాలపట్నం పోలీసులు గురువారం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ మొత్తం పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. చందన్ కుమార్ మృతదేహాన్ని విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)కి తరలించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Exit mobile version