JAISW News Telugu

Father: కూతురు పెళ్లిలో హెల్మెట్లు పంపిణీ చేసిన ఓ తండ్రి

రోడ్డు భద్రతపై జనంలో అవగాహన కల్పించాలనుకున్న ఓ తండ్రి తన కుమార్తె పెళ్లికి వచ్చిన అతిధులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఛతీస్ ఘడ్ లోని కొర్భా జిల్లాలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ముదపర్ ప్రాంతానికి చెందిన సెద్ యాదవ్ తన కుమార్తె వివాహాన్ని ఇటీవల ఘనంగా జరిపారు. పెళ్లికి బైక్ లపై వచ్చిన వారందరికీ హెల్మెట్లు ధరించి డాన్సులు చేయడం విశేషం.

రోడ్డు ప్రమాదాల సంభవించి ప్రాణాలు కోల్పోతున్నారనీ హెల్మెట్ ధరిస్తే తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు అన్న సందేశాన్ని ఈ తండ్రి తెలియజేశాడు. బైక్ లపై పెళ్ళికి వచ్చిన బంధువులందరికీ కూడా హెల్మెట్లు గిఫ్ట్ గా ఇచ్చారు.

Exit mobile version