CSK Vs RR : చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఆదివారం మధ్యాహ్నం చెన్నై లోకి చెపాక్ స్టేడియంలో కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో చెన్నై తప్పక గెలవాల్సిన పరిస్థితి. లేకపోతే చివరి మ్యాచ్ లో గెలిచిన మిగతా జట్ల బలబలాలపై ఆధారపడాల్సి ఉంటుంది. చెన్నై రాజస్థాన్ తో పాటు చివరి లీగ్ లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆప్స్ కు వెళుతుంది.
రాజస్థాన్ రాయల్స్ కు మూడు మ్యాచులు ఉండగా.. ఈ మ్యాచ్ లోనే గెలిచి ప్లే ఆప్ బెర్త్ ను కన్ ఫాం చేసుకోవాలని భావిస్తోంది. చెన్నై గత మ్యాచ్ లో గుజరాత్ పై ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలని అనుకుంటోంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడి 8 విజయాలు 3 ఓటములతో పాయింట్స్ టేబుల్స్ లో రెండో స్థానంలో కొనసాగుతుంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడి ఆరు విజయాలు, ఆరు ఓటములతో నాలుగో స్థానంలో ఉంది. అయితే ఢిల్లీ, లక్నో కూడా ఆరు విజయాలతో 12 పాయింట్లతోనే ఉన్నాయి. కానీ వాటి నెట్ రన్ రేట్ చెన్నై కంటే తక్కువగా ఉండటంతో అయిదు, ఆరో స్థానాల్లో కొనసాగుతున్నాయి. కాబట్టి చెన్నై టీం ఈ మ్యాచ్ తప్పక గెలిచి మూడో స్థానానికి ఎగబాకాలని చూస్తోంది.
రాజస్థాన్ రాయల్స్ అన్ని మ్యాచ్ లు బాగానే ఆడినా.. గుజరాత్, సన్ రైజర్స్ తో మ్యాచ్ లో చివరి బంతికి ఓడిపోయింది. ఢిల్లీపై మ్యాచ్ లో ఎంఫైర్ తప్పుడు నిర్ణయంతో సంజు శాంసన్ ఔట్ కాగా.. 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. సంజు శాంసన్, బట్లర్, యశస్వి జైశ్వాల్, రియాన్ పరాగ్ అందరూ బ్యాటింగ్ లో మంచి ఫామ్ లో ఉన్నారు. చెన్నై టీంలో అజింక్య రహానే ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. రుతురాజ్ ఇప్పటి వరకు చెపాక్ లో ఆడిన నాలుగు మ్యాచుల్లో అర్ధ సెంచరీలతో కదం తొక్కాడు.