JAISW News Telugu

Diamond Necklace : చెత్తకుప్పలో డైమండ్ నెక్లెస్.. దాని విలువ రూ.5 లక్షలు

FacebookXLinkedinWhatsapp
Diamond Necklace

Diamond Necklace

Diamond Necklace : చెన్నైలో ఓ చెత్తకుప్పలో పారిశుధ్య కార్మికులకు రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ దొరికింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. స్థానికంగా ఉంటున్న దేవరాజ్ అనే వ్యక్తి తన కూతురి పెళ్లి కోసం రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ చేయించారు. ఇటీవల చెత్తను పారవేసే క్రమంలో తన చేతిలో ఉన్న డైమండ్ నెక్లెస్ ను చెత్తడబ్బాలో వేశారు. ఆ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు చెన్నై కార్పొరేషన్ ను సంప్రదించారు.

కార్పొరేషన్ అధికారులు స్పందించి కొందరు పారిశుధ్య కార్మికులను డంపింగ్ యార్డుకు తీసుకు వెళ్లి అన్ని చెత్త డబ్బాలను వెతికించారు. ఓ చెత్తకుప్పలో డైమండ్ నెక్లెస్ లభ్యం కావడంతో చెన్నై కార్పొరేషన్ అధికారులు దానిని యజమానికి అందించారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన నెక్లెస్ యజమాని కార్పొరేషన్ అధికారులకు, పారిశుధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version