RR Vs KKR : రాజస్థాన్, కోల్ కతా మధ్య కీలక పోరు..
RR Vs KKR : రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ లో చివరి లీగ్ మ్యాచ్ గౌహతిలో జరగనుంది. కోల్ కతా ఇప్పటికే 9 విజయాలు, ఒక డ్రాతో 19 పాయింట్లతో టేబుల్ టాప్ లో ఉండగా.. 16 పాయింట్లతో రాజస్థాన్ రెండో స్థానంలో కొనసాగుతుంది.
కోల్ కతా వరుస విజయాలతో టాప్ 1 ప్లేస్ కు చేరుకోగా.. రాజస్థాన్ మాత్రం వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయి ఢీలా పడింది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆప్స్ లో క్వాలిఫైయర్ వన్ లో ఆడాలని రాజస్థాన్ భావిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి జోస్ బట్లర్ ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. యశస్వి జైశ్వాల్ ఫామ్ కోల్పోయాడు. సంజు శాంసన్, రియాన్ పరాగ్ మాత్రమే బ్యాటింగ్ లో రాణిస్తున్నారు. బౌలర్లలో యుజ్వేంద్ర చాహాల్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. బౌల్ట్ వికెట్లు తీయాలని టీం కోరుకుంటోంది.
కోల్ కతా మాత్రం టేబుల్ టాపర్ గా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. చివరి లీగ్ మ్యాచ్ కూడా గెలిచి క్వాలిఫైయర్ లోకి అడుగు పెట్టాలని అనుకుంటోంది. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ లో ఫామ్ లోకి రావాలని కోరుకుంటోంది. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ ఇద్దరు భీకర ఫామ్ లో ఉన్నారు. వీరికి తోడు వెంకటేశ్ అయ్యార్ కూడా అదరగొడుతున్నాడు. రింకూ సింగ్, రమణ్ దీప్ సింగ్ లకు బ్యాటింగ్ లో ఎక్కువ అవకాశాలు రావడం లేదు. వీరిద్దరూ కూడా రాణిస్తే క్వాలిఫైయర్ వన్ లో గెలిచి నేరుగా ఫైనల్ లోకి అడుగుపెట్టాలని కోల్ కతా అనుకుంటోంది.
అంతకుముందు చివరి లీగ్ లో ప్లేయర్లందరూ పూర్తి స్వేచ్ఛగా ఆడేందుకు చాన్స్ ఇవ్వాలని కోల్ కతా అనుకుంటోంది. గౌతం గంభీర్ మెంటర్ అయిన తర్వాత మళ్లీ టీం తిరిగి గాడిన పడింది. మ్యాచుల్లో ఎలా ఆడాలి. ఏయే ప్లాన్ లతో ముందుకెళ్లాలి. బ్యాటింగ్, బౌలింగ్, ఫ్లాన్ ఏ, ప్లాన్ బి, లేకపోతే చివరకు ఫ్లాన్ సీ తో గౌతం గంభీర్ టీంను ఒక గాడిలో పెట్టాడు. దీంతో ఈ సీజన్ లో టైటిల్ రేసులో కోల్ కతా ముందంజలో ఉంది.