PBKS Vs RCB : పంజాబ్ ఆర్సీబీ మధ్య కీలక పోరు

PBKS Vs RCB

PBKS Vs RCB

PBKS Vs RCB : పంజాబ్ కింగ్స్ ఎలెవన్, రాయల్స్ చాలెంజర్ బెంగళూరు మధ్య ధర్మశాలలో  గురువారం సాయంత్రం హై హోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. 11 మ్యాచుల్లో నాలుగు గెలిచిన పంజాబ్, ఆర్సీబీ ఇరు జట్లకు ఈ మ్యాచ్ గెలవడం కీలకంగా మారనుంది. చెరో ఎనిమిది పాయింట్లతో సమానంగా ఉన్న ఇరు జట్లు ఈ మ్యాచ్ గెలిస్తే 10 పాయింట్స్ సాధిస్తాయి. లేకపోతే అపిషీయల్ గా టోర్నీ నుంచి వైదొలుగుతాయి.

కాబట్టి మ్యాచ్ గెలిచి టోర్నీలో నిలవాలని రెండు టీంలు కోరుకుంటున్నాయి. దీని కోసం రెండు టీంలు పక్కా ప్రణాళికల్ని తయారు చేసుకున్నాయి. గాయంలో దాదాపు 5 మ్యాచులు ఆడని శిఖర్ దావన్ పంజాబ్ టీంతో చేరనున్నాడు. ఈ మార్పు పంజాబ్ బ్యాటింగ్ లైనప్ ను బలంగా మార్చనుంది. మరో వైపు రాయల్స్ బెంగళూరు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సూపర్బ్ పర్ఫామెన్స్ తో అదరగొడుతుంది. దీంతో ఆర్సీబీ ఈ మ్యాచ్ లో ఫేవరేట్ గా రంగంలోకి దిగుతోంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీంలో విరాట్ కొహ్లి, డుప్లెసిస్ ఫామ్ అందుకున్నారు. ఇప్పటికే ఏడు మ్యాచుల్లో ఓడిపోయిన తర్వాతైన ఫామ్ లోకి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విల్ జాక్స్ కూడా బ్యాటింగ్, బౌలింగ్ లో మంచి పర్ఫామెన్స్ కనబరుస్తున్నాడు.  సిరాజ్ కూడా గత మ్యాచ్ లో చక్కటి లైన్ లెంగ్త్ బాల్స్ తో బ్యాట్స్ మెన్స్ ను ఇబ్బంది పెట్టాడు.

పంజాబ్ లో శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలపైనే బ్యాటింగ్ లో ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ నాలుగు మ్యాచులైనా గెలిచింది అంటే దానికి కారణం ఈ ఇద్దరి బ్యాటింగే అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో కూడా వారు బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వాలని పంజాబ్ టీం కోరుుకుంటోంది. రెండు టీంలలో ఎవరూ ఓడినా ఇంటి బాట పట్టక తప్పదు. మొత్తం మీద బ్యాటింగ్, బౌలింగ్ విభాగానికొస్తే ఆర్సీబీ ఫేవరేట్ గా కనిపిస్తోంది.

TAGS