KKR Vs DC : కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య సోమవారం సాయంత్రం కీలక పోరు జరగనుంది. ఇప్పటికే 10 మ్యాచుల్లో 5 విజయాలు.. అయిదు ఓటములతో అయిదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు, 8 మ్యాచుల్లో 5 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతున్న కోల్ కతాకు ఈ మ్యాచ్ గెలవడం అవసరం.
ఢిల్లీ వరుసగా రెండు మ్యాచులు గెలిచి మంచి ఊపు మీద ఉంది. గత మ్యాచులో ముంబయిపై 250 పరుగులు పైగా సాధించింది. జేమ్స్ ప్రేజర్ ముగుర్క్ ఓపెనర్ గా కేవలం 27 బంతుల్లోనే 84 పరుగులు చేసి తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. పంత్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. అక్షర్ పటేల్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. ఖలీల్ అహ్మద్ ఫేస్ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నాడు.
కోల్ కతా టీంలో సునీల్ నరైన్ బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతున్నాడు. పంజాబ్ తో మ్యాచ్ లో 260 పరుగులు చేసి కూడా కోల్ కతా మ్యాచ్ ను కాపాడుకోలేకపోవడంతో ఆత్మవిశ్వాసం దెబ్బతింది. హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్ బౌలింగ్ పై పంజాబ్ బ్యాటర్లు ఎదురు దాడి చేశారు. బ్యాటింగ్ లో ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, అండ్రీ రస్సెల్ ఫామ్ లో ఉన్నారు. మిగతా బ్యాటర్లు కూడా రాణించాలని టీం యాజమాన్యం కోరుకుంటోంది.
కోల్ కతా పాయింట్ల టేబుల్స్ లో రెండో స్థానంలో ఉండగా.. ఈ మ్యాచ్ ఓడిపోతే నాలుగు, లేదా అయిదో స్థానానికి పడిపోయే అవకాశం ఉంది. గెలిస్తే రెండో స్థానం పదిలంగా ఉంటుంది. కాబట్టి రెండు జట్లకు ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది. ఢిల్లీ క్యాపిటల్స్ కు కుల్దీప్ యాదవ్ కీలక రోల్ పోషించనున్నాడు. ఢిల్లీ మొన్నటి వరకు బ్యాటింగ్ లో ఇబ్బంది పడింది. జేమ్స్ ఫ్రేజర్ ఫామ్ లోకి రావడం ఆనందం కలిగించేదే అయినా.. డేవిడ్ వార్నర్ కూడా ఫామ్ లోకి రావాలని ఢిల్లీ ఆశిస్తోంది.