DC Vs RR : ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం సాయంత్రం కీలక పోరు జరగనుంది. ఢిల్లీ పై గెలిచి మళ్లీ పాయింట్స్ టేబుల్స్ లో మొదటి స్థానాన్ని సాధించాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తుండగా.. ఆర్ ఆర్ టీంపై గెలిచి టాప్ ఫోర్ లోకి రావాలని ఢిల్లీ ఆశిస్తోంది.
ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 8 విజయాలతో పాయింట్స్ టేబుల్స్ లో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ 10 పాయింట్ల తో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ లో జేమ్స్ ప్రేజర్ ముగుర్క్ భీకర ఫామ్ లో ఉన్నాడు. అలవోకగా సిక్సులు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. అయితే పంత్, వార్నర్ , పృథ్వీ షా ఫామ్ లోకి రావాల్సి ఉంది. బౌలింగ్ విభాగంలో ఖలీల్ అహ్మద్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. మిగతా బౌలర్లు కూడా రాణించాల్సిన అవసరముంది.
రాజస్థాన్ రాయల్స్ చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ పై ఉత్కంఠ పోరులో ఓడిపోయింది. ఇంకా నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉండడం.. ఇప్పటికే 16 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉండడంతో ఒక వేళ అన్ని మ్యాచులు ఓడిపోయిన నాలుగో స్థానంలో ప్లే ఆప్ వెళ్లే చాన్సులు కనిపిస్తున్నాయి. కానీ ఈ మ్యాచ్ లో ఢిల్లీ పై గెలిచి నేరుగా ప్లే ఆప్స్ బెర్త్ కన్ ఫాం చేసుకోవాలని రాజస్థాన్ అనుకుంటోంది.
ఈ మ్యాచ్ కు ఇషాంత్ శర్మ ఫిట్ నెస్ సాధించాడు. రాజస్థాన్ తో మ్యాచ్ కు అందుబాటులో ఉండే అవకాశం ఉందని కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు. ఇప్పటి వరకు రెండు జట్లు 28 సార్లు తలపడగా.. రాజస్థాన్ రాయల్స్ 15 సార్లు విజయం సాధించింది. 13 సార్లు ఢిల్లీ గెలిచింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు రియాన్ పరాగ్, సంజు శాంసన్ లు కంటిన్యూ గా రన్స్ చేస్తున్నారు. వారిద్దరినీ అడ్డుకుంటేనే ఢిల్లీకి ఏమైనా చాన్సెస్ ఉంటాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఓడిపోతే దాదాపు ఇంటి బాట పట్టాల్సిందే. చివరి రెండు మ్యాచ్ లు గెలిచినా మిగతా జట్ల గెలుపొటములు, రన్ రేట్ పై ఆధారపడాల్సి ఉంటుంది.