crocodile : గుజరాత్‌లోని వడోదర భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంది. నీటిలో ఉండే జీవరాశులు ఇండ్లల్లోకి వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఒక ఇంటిపైకప్పు రేగులపైకి మొసలి ఎక్కి సేదతీరుతుంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరదల కారణంలో గుజరాత్ వ్యాప్తంగా 28 మంది వరకు మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
విశ్వామిత్ర నదిలోకి వరద పోటెత్తడంతో ఒడ్డున ఉన్న నివాసాల్లోకి నీరు చేరింది. దీంతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) నుంచి రెస్క్యూ టీమ్, రాష్ట్ర బృందాలు వడోదర నగరం చుట్టూ వారి ఇళ్లలో, పైకప్పులపై చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. భారత సైన్యం నుంచి మూడు కాలమ్‌లను సాయం చేసేందుకు మోహరించారు.
బుధవారం నగరం నుండి 5 వేల మందికి పైగా ప్రజలను తరలించామని, మరో 1,200 మందిని రక్షించామని రాష్ట్ర మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే వడోదర నగరంలో క్లీనింగ్, క్రిమి సంహారక మందుల పిచికారీ చేయాలని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధికారులను ఆదేశించారు. అహ్మదాబాద్, సూరత్ మునిసిపల్ కార్పొరేషన్లు, భరూచ్, ఆనంద్ మునిసిపాలిటీల నుంచి అదనపు బృందాలను కూడా తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు.
గుజరాత్‌లో వర్షాలు
కచ్ఛ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, మోర్బీ, సురేంద్రనగర్, రాజ్‌కోట్, పోర్ బందర్, జునాఘర్, గిర్ సోమనాథ్, అమ్రేలి, భావ్‌నగర్ మరియు బోటాడ్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. తాజా వర్షపాతంలో కొన్ని రోజుల్లోనే రాష్ట్రం వార్షిక సగటు వర్షపాతంలో 105 శాతం పొందింది. సౌరాష్ట్ర ప్రాంతంలోని అనేక జిల్లాలు, ముఖ్యంగా దేవభూమి ద్వారక, జామ్‌నగర్, పోర్‌బందర్ మరియు రాజ్‌కోట్‌లో భారీ వర్షాలు కురుస్తాయని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (SEOC) తెలిపింది.
బుధవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల్లో దేవభూమి ద్వారక జిల్లాలోని ఖంభాలియా తాలూకాలో 454 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఆ తర్వాత జామ్‌నగర్ నగరంలో (387 మిమీ), జామ్‌నగర్‌లోని జామ్‌జోధ్‌పూర్ తాలూకాలో (329 మిమీ) వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 251 తాలూకాల్లో 200 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది, అదే సమయంలో మరో 39 తాలూకాల్లో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
అధికారిక ప్రకటన ప్రకారం, రాష్ట్రంలోని 140 రిజర్వాయర్లు, డ్యామ్‌లు, 24 నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండగా, 206 డ్యామ్‌లలో 122 హై అలర్ట్‌లో ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ‘ప్రధాన మంత్రి పౌరుల జీవితాలు, పశువుల రక్షణపై మార్గదర్శకత్వం అందించారు. అలాగే, గుజరాత్‌కు అవసరమైన అన్ని సహాయ, సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తామని హామీ ఇచ్చారు’ అని సీఎం చెప్పారు.
VIDEO | Gujarat Rains: Crocodile spotted at roof of a house as heavy rainfall inundate Akota Stadium area of Vadodara.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz)#GujaratRains #GujaratFlood pic.twitter.com/FYQitH7eBK
— Press Trust of India (@PTI_News) August 29, 2024