Time machine : ఇజ్రాయెల్ ‘టైమ్ మెషిన్’ తో వయసు తగ్గిస్తామని రూ.35కోట్లతో ఉడాయించిన జంట  

Time machine

Time machine Scam

Israel time machine : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ జంట వృద్ధులను మోసం చేసి రూ.35 కోట్ల భారీ మోసానికి పాల్పడింది. రాజీవ్ కుమార్ దూబే, అతని భార్య రష్మీ దూబే  కాన్పూర్‌లో “రివైవల్ వరల్డ్” (రివైవల్ వరల్డ్ స్కామ్) అనే థెరపీ సెంటర్‌ను ప్రారంభించారు. అందులో వారు ఇజ్రాయెల్ నుండి తీసుకువచ్చిన యంత్రం ద్వారా 60 ఏళ్ల వ్యక్తిని 25 ఏళ్లుగా చేసుకోవచ్చని జనాలను నమ్మించారు.  “ఆక్సిజన్ థెరపీ” (ఏజ్-రివర్సల్ స్కామ్) ద్వారా వృద్ధుల యవ్వనాన్ని పునరుద్ధరించగలమని ఈ జంట తమ వినియోగదారులకు హామీ ఇచ్చారు. కలుషిత గాలి కారణంగా ప్రజలు వేగంగా వృద్ధాప్యం చెందుతున్నారని, ఈ థెరపీ నెలల్లోనే వారిలో మార్పు వస్తుందని ఆయన చెప్పారు.

పోలీసు అధికారి అంజలి విశ్వకర్మ ప్రకారం, ఈ జంట 10 సెషన్‌లకు రూ.6,000 ప్యాకేజీని,  రూ.90,000కి మూడేళ్ల లాయల్టీ సిస్టమ్‌ను అందించారు.  మోసానికి గురైన రేణు సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 10.75 లక్షల రూపాయలు మోసం చేశారని ఆరోపించారు. వందలాది మందిని సుమారు 35 కోట్ల రూపాయల మేర మోసం చేశారని తెలిపారు. వారి ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి, జంట కోసం వెతకడం ప్రారంభించారు. దూబే దంపతులు విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.

ఎలాంటి నైతికత లేకుండా బడుగు బలహీన వర్గాలను మోసం చేయడంలో మోసగాళ్లు ఎలా నిమగ్నమై ఉన్నారో ఈ ఉదంతం మరోసారి తెలియజేస్తోంది. సీనియర్ సిటిజన్లు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఔషధాలతో వృద్ధాప్యాన్ని తిరిగి తెచ్చుకోలేరని పోలీసులు సూచించారు.  ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై విచారణ జరుపుతున్నారు. త్వరలో దుండగులను పట్టుకునే అవకాశం ఉంది.

TAGS