YS Jagan : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా పోరాడుతున్నాయి. ఈనేపథ్యంలో ఏపీలో త్రిముఖ పోరుకు తెర లేచింది. ఎన్డీయే కూటమి, వైసీపీ కూటమి, కాంగ్రెస్ కూటమి మూడు తమ గెలుపునకు బాటలు వేసుకోవాలని భావిస్తున్నాయి. రోజురోజుకూ రాజకీయాలు సమీకరణాలు మారుతున్నాయి.
అన్న మీ ఓటు జగనన్నకే వేయండి. ఆంధ్రప్రదేశ్ డెవలప్ మెంట్ కావాలంటే జగనే రావాలి అని అంటే కొందరు ట్వీట్ చేస్తే.. ఆయనపై 32 కేసులున్నాయి.. మనం ఏదైనా కారు కొనాలంటేనే దాని మీద ఏదైనా కేసు ఉంటే కొనడానికి ఇష్టపడం. అలాంటిది అన్ని కేసులు ఉన్న జగన్ ను రాష్ట్రానికి సీఎంను చేస్తే ఎలా అని మరికొందరు కౌంటర్ వేస్తున్నారు. ఇలా జగన్ ను ఇంటికి సాగనంపాలని చెబుతున్నారు.
జగన్ హయాంలో దోపిడీలు, దొంగతనాలు, కబ్జాలు, దౌర్జన్యాలే రాజ్యమేలాయి. ఎటు చూసినా పాలనలో పారదర్శకత కనిపించలేదు. రౌడీయిజమే కనిపించింది. దీంతో ప్రజలు నానా తంటాలు పడ్డారు. జగన్ పాలన వల్ల పడిన ఇబ్బందులు లేకుండా చేసుకోవాలంటే జగన్ మళ్లీ రావద్దనే వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ పాలనకు చరమగీతం పాడాలని చూస్తున్నారు. డెవలప్ మెంట్ విషయంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. నిధులు మొత్తం మీటలు నొక్కి ప్రజలకు చేరవేశారు. కానీ పనులు మాత్రం చేయలేదు. దీంతో జగన్ పాలనపై పెదవి విరుస్తున్నారు. అధికార మార్పుకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. జగన్ ను ఇంటికి సాగనంపాలని చూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఓ సామాన్యుడు జగన్ కు ఎందుకు ఓటు వేయకూడదో వాట్సాప్ చాట్ లో స్పష్టంగా తెలిపాడు. ఆ స్క్రీన్ షాట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.