Weather Report : వామ్మో ఎండలు దంచుతున్నాయి. రోహిణిలో రోకళ్లు పలిగేలా ఎండలు కొడుతాయనే నానుడిని నిజం చేస్తూ గత ఐదారు రోజులుగా భానుడు భగభగమంటూ జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అయితే మరో 24 గంటల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
కేరళ తీరంలో పశ్చిమ దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న 7 రోజుల పాటు కేరళలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేటి నుంచి జూన్ 2 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణలోకి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ సూచనలు:
– రాష్ట్రంలో వర్షాలు తీవ్రమవుతున్నందున పరిస్థితులను అంచనా వేసి కొండ ప్రాంతాలకు రాత్రిపూట రాకపోకలను ఆంక్షలు విధించాలి.
– పర్యాటకులకు భద్రతా హెచ్చరికలు అందేలా చూడాలి. సరైన మార్గదర్శకాలు జారీ చేయాలి.
-నిర్మాణం లేదా నిర్వహణ పనులు జరుగుతున్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు మరియు ఇతర రహదారులపై ప్రయాణీకులకు భద్రతా బోర్డులు కనిపించేలా చూసుకోండి. వెంటనే తనిఖీలు చేపట్టి, లేని చోట భద్రతా బోర్డులు ఏర్పాటు చేయాలి.
-రోడ్లపై గుంతలు లేదా ఇతర ప్రమాదాలు ఉన్న చోట, ప్రమాదాల ప్రమాదాన్ని తగ్గించడానికి వెంటనే జోక్యం చేసుకోవాలి.
– జిల్లా కంట్రోల్ రూమ్‌లలో రోడ్డు భద్రతా విభాగానికి చెందిన ప్రతినిధులను కూడా చేర్చాలి. సంభావ్య రోడ్డు ప్రమాదాల గురించి అధికారులను అప్రమత్తం చేయడానికి అవసరమైన కంట్రోల్ రూమ్ నంబర్‌లను ప్రచురించాలి.
గాలికి పడిపోయే అవకాశం ఉన్న బోర్డులను యుద్ధ ప్రాతిపదికన కిందకు లేదా తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
– ప్రమాదకరమైన చెట్లు, కొమ్మలను నరికివేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
అయితే ఈ సూచనలు కేరళకే కాదు రుతుపవనాలు విస్తరించే అన్ని రాష్ట్రాలు పరిగణలోకి తీసుకోవాలి.