Chicken piece eat Died Child : చిన్న పిల్లలు నాన్ వెజ్ తినే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి దారుణమైన ఘటనలు జరుగుతాయి. ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం మన్నూరులో రెండేళ్ల చిన్నారికి గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని ఊపిరాడక చనిపోయాడు.
అసలు విషయంలోకి వస్తే అన్నమయ్య జిల్లా మన్నూరులో ఉండే కృష్ణయ్య, మణి దంపతులు ఆదివారం కావడంతో చికెన్ తెచ్చుకున్నారు. దాన్ని వండి హాయిగా తిందామనే సరికి విషాదం చోటు చేసుకుంది. దంపతులు చికెన్ తింటున్న సమయంలో వారి రెండేళ్ల కూతురు కిందపడ్డ చికెన్ ముక్కను తీసుకుని నోట్లో వేసుకుంది. అది కాస్త చిన్నారి గొంతులో ఇరుక్కుపోయింది.
దీంతో చిన్నారికి ఊపిరాడటం కష్టంగా మారింది. వెంటనే తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళుతుండగా చిన్నారి మరణించింది. వైద్యులు మాట్లాడుతూ.. చిన్నారికి గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుపోవడంతో ఊపిరాడక చనిపోయిందని ధ్రువీకరించారు. ఈ ఘటనతో ఆ ఇంట్లో చిన్నారి హాఠాన్మరణంతో విషాద చాయలు అలుముకున్నాయి. చిన్న పిల్లలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించాలని లేకపోతే చాలా దారుణమైన పరిస్థితులు తలెత్తుతాయని పేర్కొన్నారు.
చిన్నారులు ఎప్పుడూ ఏదో నోట్లో పెట్టుకుంటూనే ఉంటారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నం తినే సమయంలో దంపతుల్లో ఒకరు తిని మరొకరు వెయిట్ చేయాలి. చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే వారికి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా మంది ఈ సంఘటనను చూసి బుద్ది తెచ్చుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు.