Sri Reddy : శ్రీరెడ్డిపై కేసు నమోదు.. అరెస్టుకు రంగం సిద్ధం

Sri Reddy

Sri Reddy

Sri Reddy Arrest : సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితపై వ్యాఖ్యలు చేసిన సినీనటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లాలో కేసు నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మోరంపూడికి చెందిన టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి బొమ్మూరు పోలీసు స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత గౌరవానికి భంగం కలిగించేలా వీడియోలు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

శ్రీరెడ్డిపై అనంతపురం నగరానికి చెందిన తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని బుధవారం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఐ సాయినాథ్ కు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం కంచరపాలెం పోలీసు స్టేషన్ లో మరో ఫిర్యాదు నమోదైంది. దీంతో ఇప్పటికే శ్రీరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారని, ఏ క్షణంలోనైనా ఆమెను అరెస్టు చేయవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

TAGS