JAISW News Telugu

Harish Rao : మాజీమంత్రి హరీశ్ రావు బంధువులపై కేసు నమోదు

Harish Rao : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బంధువులపై కేసు నమోదైంది. ఐదంతస్తుల భవనంలో హరీశ్ రావు బంధువులు అక్రమంగా ఉంటున్నారని బాధితుడు దండు లచ్చిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారిపై మియాపూర్ పోలీసులు ట్రెస్ పాస్, చీటింగ్ కేసు నమోదైంది. తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు పై కేసు నమోదు చేశారు. ఫోస్మో హాస్పిటాలిటీ పేరుతో ప్రామిసనరీ నోటు తీసుకుని చీటింగ్ కు పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. హరీశ్ రావు బంధువులు తనకు తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారని వాపోయాడు. జంపన ప్రభావతి తనకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారని ఆరోపించారు.

Exit mobile version