Ramgopal Varma : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు
![Ramgopal Varma](https://jaisw-media-te-bucket.s3.ap-south-1.amazonaws.com/uploads/2024/11/11145109/P-10-2-2.jpg)
Ramgopal Varma
Ramgopal Varma : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు నాయుడు, లోకేశ్, బ్రాహ్మణిల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వర్మ పోస్టు చేశారంటూ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.